Satyabhama | టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) రీసెంట్గా సత్యభామ (Satyabhama)గా ప్రేక్షకుల ముందుకొచ్చిందని తెలిసిందే. క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. she safe app అవసరాన్ని తెలియజేసే నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఇప్పటికే ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
సత్యభామ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మేకర్స్ ఆసక్తికర ప్రకటన చేసి కాజల్ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఈ చిత్రం మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా కొత్త ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ఎంట్రీ ఇచ్చింది. సత్యభామ ఇప్పుడు ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్నట్టు ప్రకటించారు. ఆడియెన్స్ ఇంకేంటి రెండు ప్లాట్‌ఫాంలలో మీకు ఏది అందుబాటులో ఉంటే అందులో చూసేయండి మరి.
సుమన్ చిక్కాలా డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఆరమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ టిక్కా నిర్మించారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, నాగినీడు, హర్షవర్దన్, రవి వర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ ఎడ్మ ఇతర కీలక పాత్రలు పోషించారు.
Thangalaan | తుఫాను వచ్చేస్తుంది.. విక్రమ్ తంగలాన్ అడ్వెంచరస్ రైడ్‌కు రెడీనా..?
NBK 109 | షూటింగ్ స్పాట్లో బాబీ.. బాలకృష్ణ ఎన్బీకే 109 డైరెక్టర్‌కు బర్త్ డే విషెస్
Buddy | ఇంతకీ అల్లు శిరీష్ బడ్డీలో టెడ్డీబేర్ పాత్రలో నటించిందెవరో తెలుసా..?