Raja Saab | మూవీ లవర్స్, నెటిజన్లకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan). బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ సుందరి ప్రస్తుతం గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్ పోషిస్తోన్న రాజాసాబ్ (Raja Saab)లో నటిస్తోన్న విషయం తెలిసిందే. హార్రర్ కామెడీ జోనర్లో వస్దోన్న ఈ ఎంటర్టైనర్కు మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తున్నాడు.
కాగా ఇవాళ మాళవిక మోహనన్ బర్త్ డే సందర్భంగా రాజాసాబ్ సెట్స్‌లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా మారుతి అండ్ టీం కేక్ కట్ చేయించి మాళవిక మోహనన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. గ్లింప్స్‌లో ఇప్పటికే ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతున్న విజువల్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై సూపర్ క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
గ్లింప్స్‌లో చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ను సూపర్ కూల్ అండ్ స్టైలిష్ అవతార్‌లో చూసి సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు, మూవీ లవర్స్. మారుతి టీం లాంఛ్ చేసిన రాజాసాబ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో రిద్ది కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
Team #TheRajaSaab welcomes the dazzling beauty @MalavikaM_ on board and celebrates her birthday on set! 💥#TheRajaSaabOnApril10th #Prabhas @DirectorMaruthi pic.twitter.com/6Qq4BMn4ud
— BA Raju’s Team (@baraju_SuperHit) August 4, 2024
Prabhas | హను రాఘవపూడి-ప్రభాస్ ఫౌజీ పూజా సెర్మనీ ముహూర్తం ఫైనల్..!