Shivam Bhaje | టాలీవుడ్ యాక్టర్ అశ్విన్ బాబు (Ashwin Babu) హీరోగా నటించిన తాజా చిత్రం శివం భజే (Shivam Bhaje). అప్సర్ దర్శకత్వం వహించాడు. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ యాక్టర్ అర్బాజ్ ఖాన్ కీ రోల్ పోషించాడు. గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 1న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
శివం భజే థియేటర్లలో ప్రతీ ఒక్కరికీ గూస్బంప్స్ తెప్పించే ఎక్స్పీరియన్స్ అందిస్తుందని మూవీ లవర్స్ అంటున్నారు. మాస్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే శివంభజేను డైరెక్టర్ అప్సర్ తెరకెక్కించిన స్టైల్‌పై మూవీ లవర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. క్లి్ష్టతరమైన కథను తన రైటింగ్, మేకింగ్ స్టైల్‌తో ఎంగేజింగ్‌గా చూపిండంలో సక్సెస్ అయ్యాడని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఈ మూవీ నుంచి భయానకంగా ఉన్న కన్ను లుక్ కనిపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్లో ఇండియా మ్యాప్ ఉన్న స్టిల్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కనిపించేదంతా మున్నేత్రుడి మర్మమే అంటూ లాంచ్ చేసిన రామ్ రామ్ ఈశ్వరం సాంగ్ సినిమాపై సూపర్ హైప్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా కామెడీ, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో సాగే ఈ మూవీలో హైపర్ ఆది, సాయిధీన, తులసి, దేవిప్రసాద్, అయ్యప్ప శర్మ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ మూవీకి వికాస్ బడిస మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
Everyone is experiencing the “GOOSEBUMPS” of his presence on BIG SCREENS 🔱
Don’t miss to watch the DIVINE BLOCKBUSTER #ShivamBhaje with your fam on this weekend
🎟️ https://t.co/CbGXJ2gDv0 pic.twitter.com/xLsgW4uBQp
— BA Raju’s Team (@baraju_SuperHit) August 4, 2024
Malavika Mohanan | బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ రాజాసాబ్ సెట్స్‌లో మాళవిక మోహనన్
Prabhas | హను రాఘవపూడి-ప్రభాస్ ఫౌజీ పూజా సెర్మనీ ముహూర్తం ఫైనల్..!