Nidhhi Agerwal | ఇటీవల రాజాసాబ్ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. అతి కష్టం మీద వారిని తప్పించుకొని కారులోకి వెళ్లి కూర్చుంది నిధి అగర్వాల్. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ సమంతకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ క్రమంలో టాలీవుడ్ యాక్టర్ శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ విధానం గురించి మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి.
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ.. అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. అలా కాకుండా అభ్యంతరకరంగా (సామాన్లు కనిపించేలా) బట్టలు వేసుకుంటే అందులో విలువేముంటుంది? అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఇప్పటికే శివాజీ క్షమాపణలు కూడా తెలియజేశాడు. ఈ విషయమై శివాజీ మరోసారి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ.. బయట నుంచి హీరోయిన్లు కానీ, మన హీరోయిన్లు కానీ కాస్త ఫంక్షన్లకు వెళ్లేటపుడు కొంచెం మంచి బట్టలు వేసుకుని వెళ్లండమ్మా.. మనకెందుకీ దరిద్రం.. బయట వాళ్లందరూ ఎగబడతారు. మొన్న మనమక్కడ చూశాం కదా..? అన్నాడు శివాజీ.
ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ స్పందించింది. బాధితులను తప్పు పట్టడం సరైంది కాదు.. ఈ కామెంట్స్ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిధి అగర్వాల్ పరోక్షంగా ఈ క్యాప్సన్ పెట్టినప్పటికీ ఈ కామెంట్స్ శివాజీనుద్దేశించే చేసినట్టు అర్థమవుతోంది. మరి దీనిపై శివాజీ ఎలా స్పందిస్తాడనేది చూడాలి.
Instagram story of #NidhhiAgerwal pic.twitter.com/DhEJhpEhmi
— Vamsi Kaka (@vamsikaka) December 24, 2025
Dhurandhar | ‘ధురంధర్’ కలెక్షన్లపై పాక్ ప్రజల వింత డిమాండ్.. కలెక్షన్స్‌లో మాకు వాటా ఇవ్వాలి..
Nani | నాని ‘ది ప్యారడైజ్’లో డ్రాగన్ బ్యూటీ.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
Karate Kalyani | హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు.. కరాటే కల్యాణి ఊహించని స్పందన