హైదరాబాద్ : తన పేరుతో ఎలాంటి సంస్థలు లేవని, అలా సంస్థలు స్థాపించి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. కొంతమంది ‘కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ లాంటి పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు చేపడుతున్నట్లు తెలిసిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.
‘నా పేరుతో ఎలాంటి సంస్థలకు అనుమతి లేదు. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించబోం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎవరైనా సేవా దృక్పథంతో పనిచేయాలనుకుంటే కచ్చితంగా భారత రాష్ట్ర సమితి (BRS) పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.