Kangana Ranaut | కంగనారనౌత్ (Kangana Ranaut).. పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో లీడింగ్ హీరోలతో సినిమాలు చేస్తూ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ టాప్ హీరోయిన్ల జాబితాలో నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సిల్వర్ స్క్రీన్‌పై అలరించిన కంగనా రనౌత్ ఇక ప్రజాప్రతినిధిగా కొత్త బాధ్యతలు స్వీకరించారని తెలిసిందే. ప్రస్తుతం మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు కంగనా.
ఈ టాలెంటెడ్ యాక్టర్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. కంగనారనౌత్ తన బంగ్లాను అమ్మకానికి పెట్టిందట. ముంబై సర్కిల్లో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం తన ఖరీదైన విల్లాకు రూ.40 కోట్లుగా ధర నిర్ణయించిందని తెలుస్తోంది. సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, అమీర్ ఖాన్ లాంటి స్టార్ సెలబ్రిటీల నివాసాలున్న ముంబైలోని పాలి హిల్ ఏరియా కంగనా రనౌత్ అమ్మకానికి పెట్టిన నివాసం కూడా ఉంది.
ఈ కాస్లీ భవంతిని కంగనా రనౌత్ ఎందుకు అమ్మకానికి పెట్టిందనేది పక్కన పెడితే.. మరి టాప్ సెలబ్రిటీలున్న ఏరియాలోని ఈ విల్లా ఇంతకీ ఎవరు సొంతం చేసుకుంటారనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కంగనారనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.