Tillu Square | డీజే టిల్లుకు సీక్వెల్‌గా టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) లీడ్ రోల్లో నటించిన చిత్రం టిల్లు 2 (Tillu Square). నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహించిన టిల్లు 2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మార్చి 29న గ్రాండ్‌గా విడుదలైంది. థియేటర్లలో ఇంప్రెస్ చేసిన ఈ చిత్రం
డిజిటల్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతూ మంచి టాక్ తెచ్చుకుంది. ఓటీటీ కూడా షేక్ చేసిన టిల్లన్న ఇక టీవీలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. టిల్లు 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రం ఆగస్టు 11న స్టార్ మాలో సాయంత్రం 6 :30 గంటలకు ప్రీమియర్ కానుంది. రొమాన్స్, కామెడీ, క్రైం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కామెడీ టచ్‌తో సాగే టిల్లు 2కు మరి టీవీలో ఎలాంటి స్పందన వస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
థియేటర్లలో రూ.120 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన టిల్లు 2 నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందించగా.. మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు. సిద్దు జొన్నలగడ్డ మరోవైపు టిల్లు 3తో వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నట్టు టిల్లు 2లో ఓపెన్ ఎండింగ్ ఇచ్చి త్రీక్వెల్‌పై అంచనాలు మరింత పెంచేశాడు డైరెక్టర్.
Shivam Bhaje | గూస్బంప్స్ తెప్పించేలా శివం భజే.. డైరెక్టర్ అప్సర్పై నెటిజన్ల ప్రశంసలు
Veera Dheera Sooran | విక్రమ్, అరుణ్‌కుమార్ వీరధీరసూరన్ టీం విషెస్.. స్పెషల్ ఇదే..!
Malavika Mohanan | బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ రాజాసాబ్ సెట్స్‌లో మాళవిక మోహనన్
Kalki 2898 AD | గెట్ రెడీ.. ఇక రూ.100కే ప్రభాస్ కల్కి 2898 ఏడీ చూసే అవకాశం