Sardar 2 | పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు కార్తీ (Karthi) టైటిల్ రోల్లో నటించిన చిత్రం సర్దార్(Sardar). ఈ హిట్ ప్రాజెక్ట్ సీక్వెల్ సర్దార్ 2 (Sardar 2) కూడా సెట్స్‌పైకి వెళ్లిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మిషన్ కంబోడియా నేపథ్యంలో సాగే సర్దార్ 2లో ఇప్పటికే స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తు్న్నట్టు తెలియజేస్తూ అప్డేట్ అందించారు మేకర్స్. ఇప్పటికే తంగలాన్ నటి మాళవిక మోహనన్ కూడా టీంలో జాయిన్ అయినట్టు న్యూస్ షేర్ చేశారు.
తాజాగా మరో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు నటిస్తున్నారనే దానిపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ముందుగా వచ్చిన వార్తలే నిజమయ్యాయి. ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కార్తీ టీం. ఈ భామ ప్రస్తుతం చిరంజీవి టైటిల్రోల్లో నటిస్తోన్న విశ్వంభరలో కీ రోల్లో నటిస్తోంది.
చెన్నైలో వేసిన భారీ సెట్లో సర్దార్ 2 షూటింగ్ కొనసాగుతున్నట్టు ఇటీవలే వార్తలు కూడా వచ్చాయని తెలిసిందే. సర్దార్ 2ను కథానుగుణంగా కజకిస్తాన్, అజర్బైజాన్, జార్జియాలో చిత్రీకరించేలా ప్లాన్ చేసిందట పీఎస్ మిత్రన్ టీం. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Birthday wishes to @AshikaRanganath. We are pleased to welcome her onboard for #Sardar2.@Karthi_Offl @iam_SJSuryah @Psmithran @MalavikaM_ @Prince_Pictures @lakku76 @venkatavmedia @thisisysr @george_dop @rajeevan69 @dhilipaction @editorvijay @paalpandicinema @prosathish… pic.twitter.com/WSfwhmvvkk
— Prince Pictures (@Prince_Pictures) August 5, 2024