కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కాంగ్రెస్ ( Kolhapur Congress) లో వర్గ పోరు కారణంగా వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో మేజర్ గ్రామపంచాయతీ లతోపాటు మండల కేంద్రాలలో కాంగ్రెస్ ఘోర పరాభవం చెందింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి కంటే కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మూలంగానే కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను తిరస్కరించారన్నది బహరంగ రహస్యం.
పెద్దకొత్తపల్లి మండలం దేదినేని పల్లి గ్రామంలో మెజార్టీ వార్డు మెంబర్లకు సమాచారం లేకుండా సొంత పార్టీ వారి అని కూడా చూడకుండా ఉప సర్పంచ్ ఎన్నిక చేపట్టారని కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం వార్డు సభ్యులు సోమవారం జరిగిన ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించారు ( Boycott ) .ఈ విషయం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
స్థానికంగా పార్టీ అంతర్గత విభేదాలను చక్కదిద్దకుండా ఇతర నియోజకవర్గాలలో మంత్రి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారని సొంత పార్టీ నేతలే అసహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించడమే కాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారని సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.
ప్రమాణ స్వీకారం బహిష్కరణపై నమస్తే తెలంగాణ ఆరా తీయగా తమకు సమాచారం ఇవ్వకుండానే ఉపసర్పంచ్ ఎన్నిక చేయడం మూలంగానే బహిష్కరించినట్లు వార్డు సభ్యులు స్పష్టం చేశారు.