Mechanic Rocky | టాలీవుడ్ యాక్టర్ విశ్వక్సేన్ (Vishwak Sen) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం మెకానిక్ రాకీ (Mechanic Rocky). రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ విశ్వక్ సేన్ 10 (VS 10)గా వస్తోంది. మెకానిక్ రాకీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మెకానిక్ రాకీ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మాన్సూన్ మ్యూజిక్ ప్లే లిస్టు నుంచి గుల్లెడు గుల్లెడు సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.
జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజిషన్‌లో పాపులర్ గాయని మంగ్లీ మ్యాజికల్ వాయిస్‌తో సాగుతున్న ప్రోమో సంగీత ప్రియుల్ని ఇంప్రెస్ చేయడం పక్కా అని చెప్పకనే చెబుతోంది. మెకానిక్ రాకీ మ్యూజికల్ రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సోనీ మ్యూజిక్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
ఈ మూవీని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. మెకానిక్ రాకీగా విశ్వక్సేన్ తన చేతిలో పానను పట్టుకొని పైకి చూపిస్తున్న పోస్టర్ ఇప్పటికే ఆన్లైన్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
A vibrant folk song to vibe to 💃
Here’s the Promo of #GulleduGulledu from #MechanicRocky 💥
Full lyrical out TOMORROW at 4:04PM 🤩
🎵 @JxBe
🎤 @iamMangli
✍️ #SuddalaAshokTeja#MechanicRockyOnOCT31 🛠️‘Mass ka Das’ @VishwakSenActor @itsRamTalluri @RaviTejaDirects… pic.twitter.com/9Zh3FfeI2g
— BA Raju’s Team (@baraju_SuperHit) August 6, 2024
Kangana Ranaut | ఖరీదైన విల్లాను అమ్మకానికి పెట్టిన కంగనారనౌత్..?
Sardar 2 | ఆ వార్తలే నిజమయ్యాయి.. కార్తీ సర్దార్ 2లో హీరోయిన్ ఫైనల్..!