హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుపై ఫోన్‌ట్యాపింగ్ ఫిర్యాదు చేసిన సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ మాజీ నేత చక్రధర్‌గౌడ్ చరిత్ర అంతా నేరమయంగా ఉన్న ట్టు అతనిపై నమోదైన కేసులు వెల్లడిస్తున్నాయి. హరీశ్‌రావుపై మోపిన అభియోగాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యం లో చక్రధర్‌గౌడ్‌కు వ్యతిరేకంగా పలువురు సిద్దిపేట నేతలు గళం విప్పుతున్నా రు. ఆయన కారణంగా అన్యాయానికి గురైనవారు కేసులు పెట్టేందుకు సిద్ధం అ వుతున్నారు.
ఆయనపై గతంలో నమోదైన కేసుల చిట్టా బహిర్గతం అయింది. ‘చెల్లి’ అంటూనే స్నేహితుడి భార్యపై చక్రధర్‌గౌడ్ కన్నేసినట్టు బాధితురాలు ఆరోపించారు. తనకు ఇల్లు ఇస్తానని నమ్మబలికి, ఓ మహిళను వంచించి అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలు కన్నీ టి పర్యంతమైన వీడియో గతంలో సోష ల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ త రువాత మనస్తాపానికి గురైన ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిపింది. ఆడబిడ్డలను వేధించి, లొంగదీసుకోవ డంలో చక్రధర్‌గౌడ్ దిట్ట అని సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు.
చక్రధర్‌పై నమోదైన కేసుల జాబితా