Harish Shankar | హీరోయిన్‌కు ఒకే అయితే వాళ్లకెందుకో బాధ.. ట్రోల్స్‌పై మిస్టర్ బచ్చన్ డైరెక్టర్ హరీష్ శంకర్
Harish Shankar | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. కానీ నెట్టింట హీరో హీరోయిన్ల ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.
Harish Shankar |టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). – హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఇప్పటికే రవితేజ, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో విడుదల చేసిన సితార్, రెప్పల్ డప్పుల్ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. కానీ నెట్టింట హీరో హీరోయిన్ల ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.
అయితే లీడ్ పెయిర్ మధ్య వయస్సు నిడివి ఎక్కువగా ఉన్న సినిమాల్లో మిస్టర్ బచ్చన్ మొదటి సినిమా ఏం కాదు. ఈ ట్రోల్స్‌పై హరీష్ శంకర్ స్పందిస్తూ.. ఏజ్ గ్యాప్‌పై వస్తున్న వాదనలు నాకర్థం కావడం లేదు. ఓ ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నపుడు.. వాళ్లు చాలా విషయాలు చూస్తారు. కేవలం వయస్సు గ్యాప్ ఒక్కటే కాకుండా.. పెళ్లి కొడుకు కుటుంబ నేపథ్యం, జాతకంతోపాటు పలు విషయాలను ఆరా తీస్తారు. కానీ సినిమా విషయానికొస్తే.. మేం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది.
యాక్టర్ ఎప్పుడూ తన వయస్సును బట్టి నటించడు. సినిమాలో 25 ఏండ్ల అమ్మాయిని కూడా 50 ఏండ్ల వ్యక్తి అని నమ్మించేలా చేయాల్సి వస్తుంది. ఇది నటన. అయితే స్క్రీన్‌పై వయస్సు అనేది కొంత ఉంటుంది. వయస్సు వ్యత్యాసంతో నటికి ఎలాంటి సమస్య ఉండదు. అందుకే ఆమె సినిమాకు సంతకం చేసింది. ఈ విషయంలో నటి సౌకర్యవంతంగా ఫీలనప్పటికీ.. మరి ఎందుకో కొంతమంది వయస్సు వ్యత్యాసం గురించి బాధపడుతుంటారని ప్రశ్నించాడు హరీష్ శంకర్.
సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి చాలా సినిమాల్లో నటించారు. అంతేకాదు భారీ బ్లాక్ బస్టర్లను అందించారు. మరోవైపు రవితేజ, శ్రీలీల నటించిన ధమాకాను కూడా ఓ ఉదాహరణగా చెబుతూ.. ఒకవేళ ధమాకా ఫెయిల్యూర్ అయితే.. టీం చిన్న వయస్సున్న అమ్మాయిని తీసుకోవడం వల్లే జరిగిందని ట్రోలర్స్ చెబుతారు. వారంతా ఇప్పుడు నిశ్శబ్ధంగా ఉన్నారు.. ఎందుకంటే భారీ హిట్ అయింది. ఇది తప్పుడు.. ద్వంద్వ వైఖరి ఉండటం నాకిష్టం ఉండదంటూ ట్రోలింగ్‌కు తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు హరీష్‌శంకర్.
Read Also :
Mr Bachchan | రవితేజ స్టైలిష్ వార్నింగ్.. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ న్యూ లుక్
Rishab Shetty | 24 ఏండ్ల నిరీక్షణ.. కాంతార హీరో రిషబ్ శెట్టి కల నెలవేరిన వేళ..!
They Call Him OG | ఓజీతోపాటు మరిన్ని.. పవన్ కల్యాణ్ బర్త్ డేకు అదిరిపోయే ప్లాన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

