Mr Bachchan | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) -హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో వస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. మిస్టర్ బచ్చన్ ట్రైలర్‌ను ఆగస్టు 7న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. తాజాగా ట్రైలర్‌ను ఇవాళ రాత్రి 7:11 గంటలకు విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ మరో పోస్టర్ రిలీజ్ చేశారు. రవితేజ స్టైలిష్ లుక్‌లో సిగరెట్ తాగుతూ వార్నింగ్ ఇస్తున్నట్టు ఉన్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.
మిస్టర్ బచ్చన్ నుంచి ఇప్పటికే షేర్ చేసిన పోస్టర్లు, టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ నుంచి రవితేజ, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో విడుదల చేసిన సితార్, రెప్పల్ డప్పుల్ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తూ.. మంచి వ్యూస్ రాబడుతున్నాయి. సక్సెస్,ఫెయిల్యూర్ చుట్టాల్లాంటివి.. వస్తుంటాయ్.. పోతుంటాయ్.. యాటిట్యూడ్ ఇంటిపేరు లాంటిది.. అది పోయేదాకా మనతోనే ఉంటుందని టీజర్లో రవితేజ చెప్తున డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టీ-సిరీస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రవితేజ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌కు వీరాభిమాని కగా.. కథానుగుణంగా బిగ్ బీ అభిమానిగా కనిపించనున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
#MrBachchan MASS MAHA TRAILER today at 7.11 PM 💥💥
He is coming to ignite the Mass Entertainment on the big screens in 8 days 🔥
GRAND RELEASE WORLDWIDE ON AUGUST 15th.#MassReunion
Mass Maharaaj @RaviTeja_offl #BhagyashriBorse @harish2you @vishwaprasadtg @peoplemediafcy… pic.twitter.com/oLjqfi3EpO— People Media Factory (@peoplemediafcy) August 7, 2024
Rishab Shetty | 24 ఏండ్ల నిరీక్షణ.. కాంతార హీరో రిషబ్ శెట్టి కల నెలవేరిన వేళ..!
They Call Him OG | ఓజీతోపాటు మరిన్ని.. పవన్ కల్యాణ్ బర్త్ డేకు అదిరిపోయే ప్లాన్..!