Venezuela | వెనెజువెలాలో అనిశ్చితి.. ఆహారం, చార్జింగ్ కోసం తీవ్ర అవస్థలు
Venezuela | వెనెజువెలా దేశంపై దాడి చేసి అధ్యక్షుడు నికొలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోరస్‌ను అగ్రరాజ్యం అమెరికా బందీగా పట్టుకుని న్యూయార్క్ నగరానికి తీసుకుపోయిన క్రమంలో ఆ దేశ రాజధాని కారకాస్, పొరుగున ఉన్న నగరాల్లో తీవ్ర భయం, ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.
Venezuela | కారకాస్, జనవరి 4: వెనెజువెలా దేశంపై దాడి చేసి అధ్యక్షుడు నికొలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోరస్‌ను అగ్రరాజ్యం అమెరికా బందీగా పట్టుకుని న్యూయార్క్ నగరానికి తీసుకుపోయిన క్రమంలో ఆ దేశ రాజధాని కారకాస్, పొరుగున ఉన్న నగరాల్లో తీవ్ర భయం, ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఆహారం కోసం పెద్దయెత్తున ప్రజలు బారులు తీరారు. పలు చోట్ల అంధకారం అలముకుంది. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయంతో చాలామంది ఇండ్లకే పరిమితమై పోయారు. చాలా సూపర్మార్కెట్లు మూతపడ్డాయి. తెరిచి ఉంచిన చిన్నచిన్న దుకాణాల వద్ద 500-600 మంది బారులు తీరారు.
ముఖ్యంగా ముందు జాగ్రత్తగా బ్రెడ్ దుకాణాల వద్ద జనం పెద్దయెత్తున చేరుకున్నారు. అలాగే మందుల షాపుల వద్ద కూడా ప్రజలు ఎక్కువగా కన్పించారు. ఔషధాలతో పాటు అక్కడ అమ్మే కేన్డ్ ఫుడ్‌ను వారు కొనుగోలు చేయడం కన్పించింది. ప్రజలు తమ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల చార్జింగ్ కోసం ఎగబడ్డారు. కాగా, అక్కడ స్పల్ప సంఖ్యలో ఉన్న భారతీయ కమ్యూనిటీ కోసం భారత ఎంబసీ ఒక వాట్సాప్ గ్రూప్‌ను సృష్టించింది. దాని ద్వారా భారతీయులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు అందజేస్తున్నది.
పలు ప్రాంతాల్లో అంధకారం
అమెరికా దాడుల్లో పవర్ గ్రిడ్స్ దెబ్బ తినడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు లేక అంధకారం అలముకుంది. కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరికా దళాలు కారకాస్ ఎయిర్‌పోర్టుపై కూడా దాడి చేయడంతో రాజధాని నుంచి 100 కి.మీ వరకు ఎలాంటి వైమానిక ప్రయాణ సౌకర్యం లేకుండా పోయిందని భారత సంతతికి చెందిన సునీల్ మల్హోత్రా అనే స్థానికుడు తెలిపారు. ప్రజలు ఆహారం కోసం అల్లాడుతున్నారని, షాపుల వద్ద పెద్దపెద్ద క్యూలు ఏర్పడ్డాయని, పౌరుల్లో భయం, అనిశ్చితి, ఆందోళన నెలకొందని చెప్పారు. ఫ్యూర్టే ట్యూయనా వద్ద అధిక నష్టం వాటిల్లిందన్నారు.
కాగా, విద్యుత్తు స్తంభాల నుంచి అక్రమంగా వైర్లను లాగి కొందరు ఫోన్లకు చార్జింగ్ చేసే వ్యాపారం ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితులపై స్థానిక సంస్థలు కానీ, ప్రభుత్వం కానీ ప్రజలకు ఎలాంటి ప్రకటనలు, సూచనలు చేయలేదు. అధికారులు కూడా పూర్తి అనిశ్చితి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే అక్కడక్కడ పోలీసులు పరిస్థితులను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పౌరులు బయటకు రావడానికే భయపడుతున్నారని మల్హోత్రా తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

