Game Changer | స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంపౌండ్ నుంచి రాబోతున్న టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ గేమ్‌ఛేంజర్ (Game changer). సినీ జనాలతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రాజోలు భామ అంజలి వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉందని, దీంతో గేమ్ ఛేంజర్ షూట్‌కు ప్యాకప్ చెప్పేస్తామని ఇప్పటికే శంకర్ టీం హింట్ ఇచ్చేసింది.
తాజాగా కీలక వార్త ఒకటి అందరినీ ఖుషీ చేస్తోంది. గేమ్ ఛేంజర్ డబ్బింగ్ పనులు నేడు హైదరాబాద్‌లో షురూ అయ్యాయి. సినిమా ఎక్జయిటింగ్ మైల్ స్టోన్ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పూజా కార్యక్రమంతో డబ్బింగ్ పనులు మొదలుపెట్టింది రాంచరణ్ టీం. ఇప్పుడీ వార్తతో ఇక గేమ్ ఛేంజర్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తున్నాడని, త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ ఇస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు, సినీ జనాలు.
గేమ్‌ఛేంజర్‌లో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రాంచరణ్ కథానుగుణంగా తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడట. అంతేకాదు తండ్రి పాత్రకు జోడీగా అంజలి కనిపించనుందని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తుండగా.. పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తున్నాడు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
They Call Him OG | ఓజీతోపాటు మరిన్ని.. పవన్ కల్యాణ్ బర్త్ డేకు అదిరిపోయే ప్లాన్..!
Kavya Thapar | ఇస్మార్ట్ శంకర్ ఆడిషన్స్‌కు వెళ్లా కానీ.. కావ్య థాపర్ డబుల్ ఇస్మార్ట్ విశేషాలు
NTR Neel | హమ్మయ్య.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా లాంచ్ డేట్ ఫైనల్..!