Venezuela | పెంపుడు పిల్లి, కుక్కపైనా నిఘా పెట్టి.. పకడ్బందీగా వెనెజువెలాపై దాడి చేసిన అమెరికా
Venezuela | వెనెజువెలా అధ్యక్షుడు మదురోను బంధించడంలో అమెరికా అత్యంత పకడ్బందీగా వ్యవహరించింది. మదురోకు సంబంధించిన ప్రతి విషయాన్నీ సేకరించింది. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రహస్య బృందం నిరుడు ఆగస్టులో వెనెజువెలా రాజధాని నగరం కారకాస్‌లో అడుగు పెట్టింది.
Venezuela | వాషింగ్టన్: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను బంధించడంలో అమెరికా అత్యంత పకడ్బందీగా వ్యవహరించింది. మదురోకు సంబంధించిన ప్రతి విషయాన్నీ సేకరించింది. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రహస్య బృందం నిరుడు ఆగస్టులో వెనెజువెలా రాజధాని నగరం కారకాస్‌లో అడుగు పెట్టింది. ఈ బృందంలో అనుభవజ్ఞులైన ఏజెంట్లు ఉన్నారు. మదురో ప్రతి కదలికను నిశితంగా గమనించడమే వారి విధి. ఈ బృందం సభ్యులు ఇతరులు గుర్తు పట్టకుండా వీధుల్లో తిరిగారు. కొన్ని నెలలపాటు మదురో కదలికలను గమనించారు.
ఆయన ఉదయాన్నే ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? ఎవరితో మాట్లాడతారు? ఆయన అలవాట్లు ఏమిటి? ఆయన పెంపుడు జంతువుల అలవాట్లు ఏమిటి? వంటి వివరాలను కూడా సేకరించారు. మదురోకు సన్నిహితంగా ఉండే అంతర్గత సభ్యుల్లో ఒకరు అమెరికన్ ఇన్సైడర్ కావడంతో అత్యంత ముఖ్యమైన వివరాలు ఈ ఆపరేషన్ నిర్వహించడానికి ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా, అనేక అమెరికన్ స్టెల్త్ డ్రోన్లు ఆకాశంలో ఎగురుతూ, రహస్యంగా వీడియోలు, ఫొటోలను తీసి, పంపిస్తూ ఉండేవి.
మదురో నివాసం నమూనా నిర్మాణం
మదురో ప్రెసిడెన్షియల్ ప్యాలస్ పూర్తి స్థాయి నమూనాను కెంటకీలో జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ నిర్మించింది. దాడులను అనేకసార్లు రిహార్సల్ చేసింది. మదురోను అరెస్ట్ చేసే ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’ అని పేరు పెట్టారు. స్టీల్ డోర్స్‌ను పగలగొట్టడం, చీకట్లో నడవడం, ఎదురయ్యే ప్రమాదాన్ని తిప్పికొట్టడానికి సిద్ధమవడంలో రాత్రి, పగలు తేడా లేకుండా ఈ బృందంలోని సభ్యులకు శిక్షణ ఇచ్చారు. మదురో తరచూ 6-8 ప్రదేశాలకు మారుతూ ఉంటారని డెల్టా ఫోర్స్‌కు తెలిసింది. సాయంత్రం అయ్యే వరకు ఆయన ఎక్కడ బస చేస్తారో స్పష్టత ఉండదు.
సయోధ్య కోసం మదురో యత్నం
వెనెజువెలాపై దాడిని నిరోధించేందుకు మదురో డిసెంబర్ 23న ప్రయత్నించారు. వెనెజువెలా చమురు నిక్షేపాలను అమెరికాకు ఇస్తానని చెప్పారు. అయితే, దేశం విడిచి, తుర్కియేకి వెళ్లిపోవాలని మదురోకు ట్రంప్ చెప్పారు. మదురో అందుకు అంగీకరించలేదు.
ట్రంప్ ఆదేశించినా దాడి ఆలస్యం
ట్రంప్ డిసెంబర్ 25న దాడికి ఆదేశించారు. ఎప్పుడు దాడి చేయాలో నిర్ణయించే అధికారాన్ని పెంటగాన్‌కు అప్పగించారు. క్రిస్మస్ సెలవుల్లో దాడి చేయాలని అధికారులు భావించారు. అయితే ఈ నెల 3న అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో దాడి చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

