Ram Pothineni | పూరీజగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. బ్లాక్ బస్టర్ హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీకి కొనసాగింపుగా వస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది రామ్ అండ్ పూరీ టీం.
ఇందులో భాగంగా ఇచ్చిన గెటప్ శ్రీనుతో చేసిన చిట్‌చాట్‌లో డబుల్ ఇస్మార్ట్ విశేషాలు షేర్ చేసుకున్నాడు రామ్. డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ గురించి విన్న తర్వాత చాలా ఎక్జయిట్ అయ్యాను. ఇస్మార్ట్ శంకర్‌లో చాలా స్ట్రాంగ్‌గా కనిపించా. డబుల్ ఇస్మార్ట్ కోసం కూడా అదే లుక్‌లో కనిపించాల్సి ఉంది. క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్‌ను నవంబర్ 2023లో ప్లాన్ చేశారు. స్కంద సెప్టెంబర్ 2023లో విడుదలైంది. మధ్యలో రెండు నెలలే సమయం ఉంది. బరువు తగ్గేందుకు నా దగ్గర సమయం లేదు. సంజయ దత్ డేట్స్ దొరకడం చాలా కష్టం.. మళ్లీ ఆయన కాల్షీట్లు సంపాదించాలంటే పెద్ద టాస్క్.
అందుకే సినిమా షూట్‌ను వాయిదా వేసే పరిస్థితి లేదు. దీని కోసం నెల పాటు నా ఫోన్‌ను పక్కన పెట్టేసి బాలీ (ఇండోనేషియా)కి వెళ్లాను. 18 కిలోలు బరువు తగ్గాను. నేను అలా 86 కిలోల నుంచి 68 కిలోలకు తగ్గాను. కానీ అంత తక్కువ టైంలో చాలా కిలోలు తగ్గడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పుకొచ్చాడు రామ్.
‘Double iSmart – Double Dose Ride’ Full Video out now 💥
— https://t.co/T72za5w79y#DoubleiSmart GRAND RELEASE WORLDWIDE ON AUGUST 15th ❤️🔥 #DoubleiSmartOnAug15 pic.twitter.com/AjY8DWGtEt
— BA Raju’s Team (@baraju_SuperHit) August 7, 2024
Mr Bachchan | రవితేజ స్టైలిష్ వార్నింగ్.. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ న్యూ లుక్
Rishab Shetty | 24 ఏండ్ల నిరీక్షణ.. కాంతార హీరో రిషబ్ శెట్టి కల నెలవేరిన వేళ..!
They Call Him OG | ఓజీతోపాటు మరిన్ని.. పవన్ కల్యాణ్ బర్త్ డేకు అదిరిపోయే ప్లాన్..!