Damien Martyn : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామిన్ మార్టిన్ (Damien Martyn) కళ్లు తెరిచాడు. కొన్ని రోజులుగా కోమాలో ఉన్న అతడు ఆదివారం స్పృహలోకి వచ్చాడు. కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నాడు కూడా. దాంతో, ఇది కలా? నిజమా? అని డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. కోమా నుంచి కోలుకున్న మార్డిన్ ఆరోగ్యం రోజురోజుకు మెరుగవుతోందని వైద్యులు తెలిపారు. త్వరలోనే అతడిని ఐసీయూ నుంచి వేరే వార్డుకు తరలిస్తామని చెప్పారు.
ఒకప్పుడు విధ్వంసక ఆటగాడైన డామిన్ మార్టిన్ మెనింజిటైటిస్ జబ్బుతో బాధపడుతున్నాడు. 54 ఏళ్ల వయసున్న మార్టిన్ డిసెంబర్ 26న తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో, కుటుంబసభ్యులు అతడిని వెంటనే బ్రిస్బేన్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మార్టిన్ అరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలో చికిత్స అందించారు. అతడు కోమాలోకి వెళ్లడంతో ఇక కోలుకోవడం కలే అనకున్నారంతా. కానీ, అనూహ్యంగా మార్టిన్ వారంలో రోజుల తర్వాత కళ్లు తెరిచాడు. మనుషులను గుర్తుపడుతూ.. మాట్లాడుతున్నాడు కూడా. అతడు వైద్యానికి వేగంగా స్పందిస్తున్నాడు అని వైద్యులు వెల్లడించారు.
🚨 REPORTS 🚨
Damien Martyn has woken up from a life-threatening coma after battling meningitis. 👏
(Source – CODE Sports)#Cricket #Australia #ICC pic.twitter.com/fbtj86jfWc
— Sportskeeda (@Sportskeeda) January 4, 2026
“Positive signs…”: Gilchrist provides update on Martyn’s health amid meningitis battle
Read @ANI Story | https://t.co/eylTZUTat0#DamienMartyn #cricket #AdamGilchrist #Australia pic.twitter.com/dtY3jiTP9C
— ANI Digital (@ani_digital) January 1, 2026
మార్టిన్ ఆరోగ్యంపై అతడి స్నేహితుడు, మాజీ ఓపెన్ ఆడం గిల్‌క్రిస్ట్ కోడ్ స్పోర్ట్స్‌తో మాట్లాడాడు. ‘గత 48 గంట్లో అద్భుతం జరిగిందని చెప్పాలి. వైద్యానికి అసాధారణంగా స్పందించిన మార్టిన్ కోమా నుంచి బయటకొచ్చాడు. స్పృహలోకి వచ్చిన అతడు మాట్లాడుతున్నాడు. దాంతో.. అతడి కుటుంబ సభ్యులు అద్భుతం జరిగిందని అంటున్నారు. త్వరలోనే అతడిని ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మారుస్తాం. అతడు మరింత వేగంగా కోలుకునే అవకాశముంది. ఈ కష్ట కాలంలో అభిమానులు చూపిన ప్రేమ, అందించిన దీవెనలు, ఆర్ధిక సాయానికి అతడి భార్య అమంద కృతజ్ఞతలు చెబుతోంది’ అని గిల్‌క్రిస్ట్ తెలిపాడు.
1992లో మార్టిన్ వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 1999, 2003లో ప్రపంచకప్ గెలుపొందిన జట్టులో సభ్యుడైన మార్టిన్.. 67 టెస్టులు, 208 వన్డేలు ఆడాడు. భారత్ పర్యటనలో 2-1తో ఆసీస్ సిరీస్ గెలుపొందడంలో అతడి పాత్రే కీలకం.
Damien Martyn is the definition of batting – timing, placement, patience, footwork, and a positive mindset.🤯🤯🔥 pic.twitter.com/7fmE2IbKEP
— OldMonkOfCricket (@BhushanManmath) December 17, 2025