Harish Rao | హైదరాబాద్ : పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తప్పుబట్టారు. పీఏసీ చైర్మన్ పదవి విపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీ అని గుర్తు చేశారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికార పార్టీ నేతను పీఏసీ చైర్మన్‌గా నియమించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ ఇవ్వడం దారుణం. పీఏసీ చైర్మన్ విషయంలో ప్రభుత్వ చర్య అప్రజాస్వామికం. నిత్యం రాజ్యాంగం చేతిలో పట్టుకునే రాహుల్ గాంధీ దీనిపై సమాధానం చెప్పాలి. కేంద్రంలో పీఏసీ చైర్మన్ పదవి ఎవరు తీసుకున్నారో కాంగ్రెస్ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి వేముల, గంగుల కమలాకర్, రావూరి ప్రకాశ్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రామ్ రావు పవార్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, భాను ప్రసాద్ రావు, ఎల్ రమణ, సత్యవతి రాథోడ్ నియామకం అయ్యారు.
ఇవి కూడా చదవండి..
Telangana | పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీ
Wanaparthi | అద్దె చెల్లించలేదని గురుకుల పాఠశాల గేటుకు తాళం.. వనపర్తి జిల్లాలో ఘటన
MLA Koonamneni | పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి : కూనంనేని సాంబశివరావు