హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన(Party defected) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, క్రిమినల్ కేసులు పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Koonamneni) అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుహైకోర్టు(High court) తీర్పుపై ఆయన స్పందించారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లుగా భావించాన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామికులపై ఉందన్నారు.
ఇవి కూడా చదవండి..
Rain Alert | బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు..!
Bandi Sanjay | హైడ్రాపై విశ్వాసం పోతోంది : బండి సంజయ్
Harish Rao | జీతాల్లేక పారిశుద్ధ్య కార్మికులు విలవిల.. పోరాడి సాధించుకుందామని హరీశ్‌రావు పిలుపు