కరీంనగర్ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు ‘హైడ్రా’(HYDRAA) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) హైడ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్( Bandi Sanjay) ఆరోపించారు. కరీంనగర్ క్లాక్ టవర్ వద్ద బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.గత కొద్దిరోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతోందన్నారు. సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మొదట హైడ్రాకు సపోర్ట్ చేసిన.
పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫాంహౌజ్ లను కూలిస్తే సమర్ధించిన. కానీ, పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇండ్లను కూలుస్తున్నరు. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చ రించారు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ఎందుకీ హైడ్రామాలు? అక్రమ భవనాలకు, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడెందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.