Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత ఏడు నెలల నుంచి జీతాల్లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు పారిశుద్ధ్య కార్మికులు.
తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లిపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. గత ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో.. ఆ పారిశుద్ధ్య కార్మికుడు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. చేసేదేమీ లేక చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం విషాదకరం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతీ నెల మొదటి తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటే సరిపోదు. అమలు చేసి చూపాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య ఉద్యోగుల జీతాల సమస్యను వెంటనే పరిష్కరించి, పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలి. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. పోరాడి, కొట్లాడి హక్కులు సాధించుకుందాం అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లిపూర్ గ్రామ పంచాయితీ ఉద్యోగి 7 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఒత్తిడిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం విషాదకరం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతీ నెల మొదటి తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటే సరిపోదు. అమలు చేసి చూపాలి.… pic.twitter.com/fhdyCDKLaw
— Harish Rao Thanneeru (@BRSHarish) September 9, 2024
ఇవి కూడా చదవండి..
Kajal Aggarwal | చీరకట్టులో చందమామలా కాజల్.. ఫోటోలు వైరల్
MLA Kamineni | ఎమ్మెల్యే కామినేనికి తృటిలో తప్పిన ప్రమాదం..