Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని నువ్వు.. సీఎం స్థాయి దిగజారి మాట్లాడుతున్నావ్ అంటూ రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. సుమతీ శతకానికి సంబంధించిన పద్యాన్ని ట్వీట్ చేశారు హరీశ్‌రావు.
కనకపు సింహాసనమున
శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము కట్టిన
వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!
ఈ పద్యం సీఎం రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. తప్పు మీద తప్పు చేసి వదరబోతులా ప్రవర్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తీరును ప్రజలందరు గమనిస్తున్నారు. నీ పుట్టిన రోజున తండ్రి వయసున్న కేసీఆర్ మీద, తెలంగాణ కోసం కొట్లాడిన గొప్ప వ్యక్తి మీద, నువ్వు చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయం. నీ లాగా వికృతంగా మాట్లాడే ముఖ్యమంత్రి నీ ఈ దేశం ఎప్పుడూ చూసి ఉండదని హరీశ్‌రావు పేర్కొన్నారు.
మూసీ నీళ్ళ మురికితో కడిగినా నీ నోరు మురికి పోదు. నీ వంకర బుద్ధి ఇగ మారదు. నీ లాగా చిల్లరగా మేము మాట్లాడలేము.
పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని, అభివృద్ధి పథంలో నడిపిన గంభీరమైన చరిత్ర మాది. బ్యాగులు మోసి, బ్యాగులు పంచి అడ్డ తోవన అధికారంలోకి వచ్చిన నీచ చరిత్ర నీది. నీ దోపిడిని, నీ దొంగబుద్ధిని నిరూపించి ప్రజా క్షేత్రంలోనే నీకు బుద్ధి చెబుతం. పిచ్చి ప్రగల్బాలు మాని పరిపాలన మీద దృష్టి పెట్టు. నిరంకుశత్వం మాని నిర్మాణాత్మక నిర్ణయాలపై శ్రద్ద వహించు అని హరీశ్‌రావు సూచించారు.
కనకపు సింహాసనమున
శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము కట్టిన
వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది.
కేసీఆర్ గారి కాలి గోటికి కూడా సరిపోని నువ్వు, సిఎం స్థాయి దిగజారి మాట్లాడుతున్నావు.
తప్పు మీద తప్పు చేసి…
— Harish Rao Thanneeru (@BRSHarish) November 8, 2024
ఇవి కూడా చదవండి..
SSC Exam Fee | పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల
Telangana | ఎమ్మెల్యేల అనర్హత కేసు.. తదుపరి విచారణ 11కు వాయిదా