Revanth Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇంటింటి వివరాలను సేకరించి స్టికరింగ్ చేసే ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుందని, 9వ తేదీ నుంచి అసలు సర్వే మొదలవుతుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వంలో చేపట్టిన సమగ్ర సర్వేపై నాడు టీడీపీ నేతగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అడ్డమైనోళ్లను ఇంటికి పంపిస్తే వివరాలు ఇవ్వాలా..? ఎవడన్న బుద్ధి ఉంటేటోడు చేసే పనేనా..? ఇది అని నాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నిలదీశారు. మరి ఇవాళ ఇప్పుడు అడ్డమైనోళ్లని ఇళ్లకి పంపేది ఎవరు? వాళ్ళని ఏమనాలి అని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేత సతీశ్ రెడ్డి నిలదీశారు.
ఇవాళ అడ్డమైనోని మన ఇంటికి పంపించి మన ఆస్తులు, మన ఖాతాలు, మన వివరాలన్నీ అడ్డమైనోని చేతిల పెట్టమంటడ. ఎవడన్న బుద్ధి ఉండేటోడు చేసే పనేనా..? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్న మంది వివరాలు ఎటు పోయిన పర్వా లేదు అనుకుంటుండ ఈ ముఖ్యమంత్రి గారూ. కనీస పరిజ్ఞానం, జ్ఞానం ఉన్నోడు ఎవడైనా చేసే పనేనా..? ఇట్లాంటి వివరాలు సేకరించమంటడ. ఏదో ఎగిరి దుంకి చేస్తున్న అన్నట్టు మాటలు మాట్లాడుతున్నడు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే (కుల గణన/ రాజకీయ గణన) గురించి@revanth_anumula గారి మాటల్లో 👇
ఇప్పుడు అడ్డమైనోళ్లని ఇళ్లకి పంపేది ఎవరు? వాళ్ళని ఏమనాలి❓ pic.twitter.com/iXhHCOBZoa
— YSR (@ysathishreddy) November 8, 2024
ఇవి కూడా చదవండి..
పాదయాత్ర కాదు.. యాదగిరిగుట్టకు మోకాళ్ల యాత్ర చేయాలి.. రేవంత్‌పై రాకేశ్ రెడ్డి ఫైర్
KTR | సీఎం అయ్యి ఉండి మేఘాకు గులాంగిరీ చేస్తున్నావా.. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్