KTR : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president), మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి తనను అరెస్ట్ చేయించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడని విమర్శించారు. మేఘా కృష్ణారెడ్డికి అనుకూలంగా సీఎం వ్యవహార శైలి ఉందని అన్నారు. ఈ విషయమై ఎక్స్ వేదికగా రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘దమ్ముందా..?’ అంటూ పలు ప్రశ్నలు వేశారు.
‘మేఘా కృష్ణారెడ్డిని సుంకిశాల ఘటనలో బ్లాక్ లిస్ట్ చేసే దమ్ముందా..?’ అని ప్రశ్నించారు. ‘మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా..?’ అని ఎక్స్ వేదికగా క్వశ్చన్ చేశారు. ‘దమ్ముందా ఆ ఆంధ్రా కాంట్రాక్టర్‌ను ఆయన ఈస్టిండియా కంపెనీని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తీసివేయడానికి..? దమ్ముందా లేదా..?’ అంటూ ప్రశ్నలు సంధించారు. ‘సీఎం అయ్యి ఉండి మేఘాకు గులాంగిరీ చేస్తున్నావా..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ లోపాల గురించి ప్రశ్నించే శక్తి రావడానికి మీకింకా ఎంత సమయం పడుతుంది..?’ అని కేటీఆర్ ఆంగ్లంలో ప్రశ్న వేశారు. ‘తెలంగాణకు తొలి ప్రాధాన్యం అనే ఆలోచన రావడానికి మీకు ఇంకా ఎన్ని రోజులు కావాలి..?’ అని నిలదీశారు. ఈ పోస్టుతోపాటు ‘సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్‌పై చర్యలేవీ’ అనే శీర్షికతో ప్రచురితమైన పత్రికా క్లిప్పింగ్‌ను కేటీఆర్ జత చేశారు.
నా అరెస్టు కోసం ఉవ్విళ్ళూరుతున్న రేవంత్ రెడ్డి!
దమ్ముందా మెఘా కృష్ణా రెడ్డి ని సుంకిసాల ఘటనలో బ్లాక్ లిస్ట్ చెయ్యడానికి!
దమ్ముందా మెఘా కృష్ణా రెడ్డి ని అరెస్ట్ చెయ్యడానికి?
దమ్ముందా ఆ ‘ఆంధ్రా కాంట్రాక్టర్’ని తన ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుండి… pic.twitter.com/eiFO7bbH1A
— KTR (@KTRBRS) November 8, 2024