సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు చేయాల్సింది పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి సూచించారు. సీఎం హోదాలో ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకు క్షమించమని ఆ దేవుణ్ని వేడుకుంటూ ప్రాయశ్చిత్త యాత్ర చేయాలని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా ఉంటూ ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తానని రైతులకు హామీ ఇస్తూ.. ఏకంగా లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేశారని ఏనుగుల రాకేశ్ రెడ్డి గుర్తుచేశారు. రాజ్యాన్ని పాలించే రాజు ఒట్టేసి మాట తప్పితే ఆ ప్రభావం, దైవాగ్రహం ప్రజల మీద పడుతుందని చెప్పారు. అందుకే, తెలంగాణలో ఈ సారి వర్షాలు ఆలస్యంగా పడ్డాయని అన్నారు. ములుగు అడవులు కూడా ఎన్నడూ జరగని విధంగా విధ్వంసమయ్యాయని.. ధామగుండంలో చెట్లు పోతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నాశనమైందని.. రియల్ ఎస్టేట్ రంగం, వ్యాపారాలు, కొనుగోలు అమ్మకాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయని.. మార్కెట్లో రూపాయి తిరిగే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
మూసీ పుట్టిన వికారాబాద్లో అడవులు ధ్వంసం చేసి.. మూసీ ప్రవహించే హైదరాబాద్లో ఇల్లు కూలగొట్టి వలిగొండలో పాదయాత్ర చేస్తావా అని సీఎం రేవంత్ రెడ్డిపై రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. అయినా పాదయాత్ర చేయాల్సింది రైతుల కల్లాల కాడికి, ఛిద్రమైన మా పోచంపల్లి చేనేతల మగ్గాల కాడికి, నిత్యం ఆసుపత్రుల పాలవుతున్న మా గురుకుల విద్యార్థుల దగ్గరకు అని అన్నారు. ప్రజల మద్దతు ఉంటే మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎందుకు అక్రమంగా అరెస్టు చేస్తున్నావని ప్రశ్నించారు. ప్రజలు నిలదీస్తారని ఈ కథలు పడుతున్నావ్.. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు.
🔹పాదయాత్ర కాదు ముందు యాదగిరి నరసింహ స్వామి దగ్గరికి రేవంత్ రెడ్డి @revanth_anumula గారు మొకాళ్ళ యాత్ర చేయాలి.
🔹అయినా నువ్వు చేసేది పాదయాత్ర కాదు పాపపు యాత్ర, ప్రాయశ్చిత్త యాత్ర, పశ్చాత్తాప యాత్ర.
🔹రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణా ప్రజలకు ప్రతినిధి గా ఉంటూ ఆగస్టు 15… pic.twitter.com/xwAfPUykdD
— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) November 8, 2024