Harish Rao | ప్రతిపక్షంపై పగ.. ప్రజలకు దగా.. ఇదీ రేవంత్ రెడ్డి తీరు : హరీశ్‌రావు
Harish Rao | పరిపాలన చేయడం చేతకాక ఫ్రస్టేషన్లో తిట్ల పురాణం అందుకుంటున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.
Harish Rao | మహబూబ్‌నగర్ : పరిపాలన చేయడం చేతకాక ఫ్రస్టేషన్లో తిట్ల పురాణం అందుకుంటున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రతిపక్షంపై పగ పెంచుకుని, ప్రజలకు దగా చేస్తున్నాడు.. ఇదీ రేవంత్ రెడ్డి తీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కురుమూర్తి స్వామిని దర్శించుకున్న అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
కనబడ్డ దేవుడు, మసీదు, చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తానని మాట తప్పాడు. మాటతప్పి పాలమూరు పేరు చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. అబద్ధాలు ఆడడమే రేవంత్ రెడ్డి డీఎన్ఏ. కేసీఆర్ ఆదేశిస్తే మూడుసార్లు రాజీనామా చేశాను. పంద్రాగస్టు లోపల పూర్తి రుణమాఫీ నువ్వు చేసుంటే రైతుల కోసం నేను రాజీనామా చేసేవాడిని. 10 ఏళ్లలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన వాళ్ళం. ఎన్ని తిట్లు అయినా మేము భరిస్తాం కానీ ప్రజలను మోసం చేస్తే మాత్రం ఊరుకోం అని హరీశ్‌రావు హెచ్చరించారు.
నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డివి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డివి. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి రూ. 4 వేల కోట్లతో పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు అందించింది కేసీఆర్. 30 లక్షల నుండి కోటి 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి తెలంగాణ చేరిందంటే అది కేసీఆర్ కృషి అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
KTR | ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు..! హిమాచల్ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ట్వీట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

