Patnam Narender Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని బుధవారం కొడంగల్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. లగచర్ల దాడి ఘటనలో నరేందర్‌రెడ్డి పోలీసు కస్టడీ పిటిషన్‌పై కొడంగల్ కోర్టులో విచారణ జరిగింది. నరేందర్‌రెడ్డిని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా విచారణకు ఈ నెల 22కు వాయిదా వేసింది.
ఈ సందర్భంగా కొడంగల్ కోర్టు ఆవరణలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పతనాన్ని కొడంగల్ నుంచి స్టార్ట్ చేస్తాను. రైతులకు మద్దతిస్తే అక్రమ కేసులు పెడుతారా..? పోలీసు, ఇంటెలిజెన్స్, సీఎం వైఫల్యం వల్ల దాడి జరిగింది. ఆ దాడిని డైవర్షన్ చేసేందుకు నా మీద కేసులు పెట్టిండు. ఈ కేసు కుట్రలో భాగమే. న్యాయస్థానాల మీద గౌరవం, విశ్వాసం ఉన్నది. నిర్దోషిగా నేను బయటకు వస్తాను అని పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
రైతులకు మద్దతిస్తే నా మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారా?
పోలీసులు, ఇంటెలిజెన్స్, రేవంత్ వైఫల్యం వల్లనే అధికారులపై ఆ దాడి జరిగింది.
ఖచ్చితంగా రేవంత్ పతనం కొడంగల్ నుండే మొదలు పెడతా.
– మాజీ ఎమ్మెల్యే @PNReddyBRS pic.twitter.com/zoDo0Z4YLp
— BRS Party (@BRSparty) November 20, 2024
ఇవి కూడా చదవండి..
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
KTR | ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు..! హిమాచల్ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ట్వీట్