CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి.. ఈ పేరు వింటేనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మార్పు కోసం ఆశపడి అధికారం కట్టబెడితే.. గద్దెనెక్కిన తర్వాత హామీలను తుంగలో తొక్కి, ప్రజలపై అడుగడుగునా ఉక్కుపాదం మోపుతూ నిర్బంధకాండ కొనసాగిస్తున్నారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రావణాకాష్టంలా మారింది. పల్లెలు జైళ్లలా మారాయి.. పట్టణాలు యుద్ధ క్షేత్రాల్లా మారి.. ప్రజాపాలనపై ప్రశ్నించే గొంతుకలవుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలపై కన్నెర్రజేస్తూ.. కటకటలాపాలు జేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనని ఆచరణలో చేసి చూపిస్తున్నారు.
ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి.. ప్రతిపక్ష పార్టీని నోటికొచ్చినట్లు దూషిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. చివరకు బాలలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే టీచర్లపై కూడా రేవంత్ నోరు పారేసుకుని ముఖ్యమంత్రి పదవికి కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రయివేటు టీచర్లకు ఏం చదువు రాదని, వారిని అవమానించేలా మాట్లాడుతూ.. తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు. ఇప్పుడేమో అదే ప్రయివేటు స్కూల్ బస్సుల కోసం వెంపర్లాడుతున్నారు. అప్పుడు పనికిరాని ప్రయివేటు స్కూళ్లు.. ఇప్పుడు తనకు అవసరం రాగానే బలవంతంగా పాఠశాలలను మూసివేయిస్తున్నారు. కాంగ్రెస్ మీటింగ్‌ల కోసం ప్రయివేటు స్కూళ్ల బస్సులను తరలిస్తున్నారు. అది కూడా అధికారికంగా డీఈవోతో ఉత్తర్వులు ఇప్పించి.. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రయివేటు స్కూల్ బస్సును మీటింగ్‌లకు తరలిస్తున్నందుకు సెలవు ప్రకటించాలని డీఈవో అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.
రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లలో ఇంటర్ పాసైనోళ్లు, డిగ్రీ ఫెయిలైనోళ్లే పాఠాలు చెప్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఏడాది ఆగస్టు నెలలో కామెంట్ చేశారు. 30 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిన సందర్భంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా మరోసారి రేవంత్ నోరు పారేసుకున్నారు. మీకున్న అనుభవం, విద్య ప్రైవేటు టీచర్లకు లేవు. కానీ పేద తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకు పంపించడమే ప్రతిష్ఠగా భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆలోచించాల్సి అవసరం ఉందంటూ ప్రయివేటు టీచర్లను అవమానించేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నిన్న హనుమకొండలో, నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ సభల నేపథ్యంలో ప్రయివేటు పాఠశాలలను బలవంతంగా మూసివేయించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాల్సిన పాఠశాలలు.. రాజకీయ వేదికలుగా మారకూడదని హితవు పలుకుతున్నారు.
సిరిసిల్లకు సీఎం రాకడ.. సర్కార్ వింత పోకడ..
ప్రైవేట్ బడులు బంద్ పెట్టిచ్చి సభకు బస్సులు పెట్టిస్తున్న కాంగ్రెస్ సర్కార్
డిసెంబర్ రెండవ శనివారం రోజు వర్కింగ్ డే గా స్కూల్ నడిపించమని DEO ఉత్తర్వులు
ముఖ్యమంత్రి వస్తే స్కూళ్ళు మూయడమేంటి..?
సభకు, చదువులకు లింకేంటి..?
కాంగ్రెస్ చేసే… pic.twitter.com/Q3UFeB7GcP— BRS Party Sircilla (@BrsSircilla) November 19, 2024
ఇవి కూడా చదవండి..
Holidays | వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. బలవంతంగా ప్రయివేటు స్కూళ్ల మూసివేత..!
TG-TET-2024-II | నేటి సాయంత్రంతో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు
Harish Rao | 11 నెలల కాలంలో 42 మంది విద్యార్థులు మృతి.. రేవంత్ సర్కార్‌పై మండిపడ్డ హరీశ్‌రావు