Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ విధానాలు, మోసపూరిత వైఖరి టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యలతో మరోసారి రుజువైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి రాజ్యాంగ రక్షణ కోసం ప్రవచిస్తుంటే, తెలంగాణలో మాత్రం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ గారి ద్వంద ప్రమాణాలకు నిదర్శనం అని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నామని స్వయంగా రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు రాజ్యాంగాన్ని కాపాడుతున్నానని చెప్పుకుంటూ, అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం రాహుల్ గాంధీ గారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని హరీశ్‌రావు మండిపడ్డారు.
The double standards and hypocrisy of @RahulGandhi ji completely exposed by Telangana TPCC President.
Rahul Gandhi boasts of being the savior of the Constitution, but @INCTelangana President Shri. Mahesh Kumar Goud confirms that the defections happening in Telangana are in… pic.twitter.com/sJFGYIzpVy
— Harish Rao Thanneeru (@BRSHarish) October 23, 2024
ఇవి కూడా చదవండి..
KTR | కొండా సురేఖ వ్యాఖ్యలతో నా పరువు, ప్రతిష్ట దెబ్బతిన్నాయి.. కోర్టులో కేటీఆర్
Dosa Stuck in Throat | గొంతులో దోశ ఇరుక్కొని వ్యక్తి మృతి.. నాగర్ కర్నూల్లో షాకింగ్ ఘటన
Group-1 | జీవో 29ని వెంటనే రద్దు చేయాలని కేయూ లైబ్రరీ ఎదుట నిరసన