Dosa Stuck in Throat | రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకున్నది. గొంతులో దోశ ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. కల్వకుర్తికి చెందిన వెంటకయ్య అనే వ్యక్తి మద్యం సేవించి ఆ తర్వాత దోశ తిన్నాడు. అయితే, దోశ గొంతులో ఇరుక్కుకపోవడంతో ఊపిరాడలేదు. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతన్ని వెంటనే ఆసుప్రతికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుత ఈ ఘటన అందరినీ షాక్కు గురి చేస్తున్నది. గతంలో కేరళలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకున్నది. వలయార్లో ఇడ్లీలు తినే పోటీలు జరిగాయి. 50 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి పోటీలో పాల్గొన్నాడు. పోటీలో భాగంగా ఇడ్లీలు తింటున్న సమయంలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు అతన్ని ప్రానాలు కాపాడేందుకు గొంతులో నుంచి ఇడ్లీలను బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.