KTR | హైదరాబాద్ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తన పరువు, ప్రతిష్ట దెబ్బతిన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కేటీఆర్ వాంగ్మూలాన్ని 30 నిమిషాల పాటు నమోదు చేసింది నాంపల్లి స్పెషల్ కోర్టు.
సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న నాకు కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం కలిగించాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏమిటి అని, వాటి గురించి వివరాలు చెప్పగలరా అని కేటీఆర్‌ను జడ్జి ప్రశ్నించారు. అయితే ఒక మహిళ పట్ల తనకున్న గౌరవం నేపథ్యంలో… కొండా సురేఖ సాటి మహిళ సమంతతో పాటు నాపై చేసిన అతినీచమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తిరిగి చెప్పడం ఇష్టం లేదని కేటీఆర్ అన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల తాలూకు పూర్తి రాతపూర్వక ఫిర్యాదును మీ ముందుంచానని కేటీఆర్ తెలిపారు. ఆమె వ్యాఖ్యలను నేరుగా నేను తన నోటితో చెప్పలేను అని కోర్టుకు విజ్ఞప్తి చేశారు కేటీఆర్. ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ కుట్రపూరితంగా తనపై అసత్యపూరిత వ్యాఖ్యలు చేశారన్న కేటీఆర్.
బాధ్యత గల పదవిలో ఉన్న మహిళా మంత్రి నా పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. సాక్షులు దాసోజు శ్రవణ్, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్.. 18 ఏండ్లుగా నాకు తెలుసు. కొండా సురేఖ వ్యాఖ్యలను టీవీలో చూసి వాళ్లు నాకు ఫోన్ చేసి చెప్పారు. సురేఖ వ్యాఖ్యలతో నా పరువు, ప్రతిష్ట దెబ్బతిన్నాయి. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలని కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
KTR | హోం మంత్రిని నియమించండి.. శాంతి భద్రతలు కాపాడండి.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచన