KTR | హైదరాబాద్ : రాష్ట్రానికి తక్షణమే హోం మంత్రిని నియమించి, శాంతి భద్రతలను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. అంబర్‌పేట్‌లోని సాయిబాబా నగర్లో ఇటీవలే వృద్ధ దంపతులు లింగారెడ్డి, ఊర్మిళ దేవి దారుణ హత్యకు గురికాగా, వారి కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి కేటీఆర్ పరామర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీనియర్ సిటిజెన్స్ లింగారెడ్డి, ఊర్మిళదేవిని పట్టపగలు చంపడం దారుణమన్నారు. హైదరాబాద్‌లోని ప్రతి ఒక్కరిని ఈ హత్యలు కలిచివేసాయన్నారు. ఆ వృద్ధ దంపతుల ముగ్గురు కుమార్తెలు బాధలో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో 10 లక్షలు సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఏ బస్తీకి ఆ బస్తీ సీసీ కెమెరాలు పెట్టడం జరిగిందన్నారు. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పనిచేయమన్నాము.. శాంతిభద్రతలు బాగుండే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ కేసుని పోలీసులు చేధించలేకపోయారు అని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగ్గా లేవని జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుతున్నాం ఒక్క హోం మంత్రిని నియమించండి. పోలీసులని మా మీద ఉసిగొల్పడం కాదు, అశోక్ నగర్లో పిల్లలు మీద దాడులు చేయించడం కాదు.. శాంతిభద్రతలను కాపాడండి. సమర్ధవంతమైన పోలీస్ అధికారులు చాలా మంది ఉన్నారు.. వారికి ఫ్రీడమ్ ఇవ్వండి.. పని చేయనివ్వండి అని కేటీఆర్ సూచించారు.
ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ప్రజలు ఎదురు చూడకండి. హైదరాబాద్‌లో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి మీకు అండగా మేము ఉంటాము. పని చేయని సీసీ కెమెరా లును బాగు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంటుంది. మీతో కాకపోతే మా సొంత ఖర్చులతో అయినా చేయిస్తామని కేటీఆర్ చెప్పారు.
Was gutted to learn about the horrific daylight murder of a senior citizen couple Sri Linga Reddy Garu & Smt. Urmila Devi Garu in Bagh Amberpet of Hyderabad
Visited the bereaved family along with MLA @KaleruVenkatesh Garu and offered my heartfelt condolences to the three… pic.twitter.com/Cb02FQ3rNr
— KTR (@KTRBRS) October 23, 2024
ఇవి కూడా చదవండి..
KTR | అన్ని రంగాల్లో వైఫల్యం.. అన్ని వర్గాల్లో ఆగ్రహం..! కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్