హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 23: రాష్ట్రంలోని గ్రూప్-1 (Group-1)నియామకాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం అభ్యర్థుల ఉద్యోగావకాశాలను దెబ్బతీసే జీవో 29ని(G.O 29) వెంటనే రద్దు చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ నరసింహారావు డిమాండ్ చేశారు. పాత జీవో 55 పునరుద్ధరించి, దాని ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాలని బుధవారం కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ(KU library) ఎదుట ప్లకార్డులతో పీడీఎస్ ఆధ్వర్యంలో నిరసన (Protest)చేపట్టారు.
ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం రాజకీయ బేషజాలాలకు పోకుండా గ్రూప్-1 అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి వెంటనే అభ్యర్థులతో చర్చలు జరపాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింల ఉద్యోగావకాశాలను దెబ్బతీయాలని చూస్తే రేవంత్రెడ్డి సరారు తీవ్ర పరిణామాలను ఎదురోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేయూ పీడీఎస్యూ నాయకులు అశోక్, నరేశ్, చరణ్, వీరన్న, సూర్య, స్వాతి, పృథ్వీరాజ్, సంగీత, అనూష ఉన్నారు.