Vijay-Rashmika | ఉదయపూర్‌లో ‘విరోష్’ పెళ్లి సందడి .. బయల్దేరిన విజయ్–రష్మిక, మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్
Vijay-Rashmika | టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పేర్లు గత కొద్ది రోజులుగా నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని ప్రచారం జరుగుతున్నా మొన్నటి వరకు స్పందించలేదు.
Vijay-Rashmika | టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పేర్లు గత కొద్ది రోజులుగా నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని ప్రచారం జరుగుతున్నా మొన్నటి వరకు స్పందించలేదు. అయితే తాజాగా తమ ప్రేమ, పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తరువాత పెళ్లి వేడుకల సందడి మొదలైంది. ఈ నెల 26న వివాహం జరగనుండగా, వేడుక కోసం ఈ జంట రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు బయల్దేరింది. ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన వీరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విజయ్ వెంట ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా ఉండడం అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఉదయపూర్ ప్యాలెస్‌లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా వీరి ప్రేమ, పెళ్లిపై వార్తలు వినిపించినా ఈ జంట స్పందించలేదు. అయితే ఆదివారం సోషల్ మీడియాలో ఒకే పోస్ట్‌తో పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అభిమానులు ప్రేమగా పిలిచే ‘విరోష్’ పేరునే తమ వివాహానికి శీర్షికగా పెట్టామని పేర్కొన్నారు.
మేము ఏదైనా ప్లాన్ చేసే ముందు… మా కోసం మేం ఎంపిక చేసుకునే ముందు… మా కంటే మీరే ముందున్నారు. మీరు ప్రేమగా పెట్టిన పేరు ‘విరోష్’. మీ అందరి ఆశీర్వాదాలతో జంటగా మీ ముందుకు వస్తున్నాం. ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’” అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. ఉదయపూర్‌లో పెళ్లి అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని ఓ లగ్జరీ హోటల్లో వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు, పలువురు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని సమాచారం. లఅభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ కలల కపుల్ పెళ్లి వేడుక సోషల్ మీడియాలో మరింత సందడి చేయనుంది.
My Love’s #Virosh off to Udaipur 🧿❤️#VijayDeverakonda #RashmikaMandanna https://t.co/ulGiA8a4aP pic.twitter.com/3hkfonAYX9
— Pavan Kumar (@pavankumar__123) February 23, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

