సర్కార్ కుట్ర భగ్నం!
నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ జంక్షన్లో ఏర్పాటు చేసిన మహానీయుల విగ్రహాలను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేయాలనే కుట్రలను దళిత సంఘాలు భగ్నం చేశాయి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి కనిపించకూడదనే కుట్రలో భాగంగా అధికారులు ఉదయం జేసీబీలతో వచ్చి విగ్రహాల చుట్టూ ఉన్న ప్లాట్ ఫామ్‌ను పోలీసుల సహకారంతో కూల్చివేశారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నేతలు మెరుపు వేగంతో అక్కడికి చేరుకొని కూల్చివేతలను అడ్డుకొని ధర్నా చేశారు.
- బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి కనిపించకూడదనే కూల్చివేతల డ్రామా
- మర్రిగూడ బైపాస్‌లోని విగ్రహాల కూల్చివేతకు సర్కార్ ప్రణాళిక
- భగ్గుమన్న దళిత సంఘాలు..
- రోడ్డు విస్తరణ పేరుతో జంక్షన్‌లోని మహనీయుల విగ్రహాలు తొలగిస్తే ఊరుకునేది లేదంటూ మంత్రి కోమటిరెడ్డిని హెచ్చరిస్తూ ఉదయం మెరుపు ధర్నా
- మధ్యాహ్నానికల్లా దిగొచ్చిన సర్కార్
నల్లగొండ, ఆగస్టు 4: నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ జంక్షన్లో ఏర్పాటు చేసిన మహానీయుల విగ్రహాలను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేయాలనే కుట్రలను దళిత సంఘాలు భగ్నం చేశాయి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి కనిపించకూడదనే కుట్రలో భాగంగా అధికారులు ఉదయం జేసీబీలతో వచ్చి విగ్రహాల చుట్టూ ఉన్న ప్లాట్ ఫామ్‌ను పోలీసుల సహకారంతో కూల్చివేశారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నేతలు మెరుపు వేగంతో అక్కడికి చేరుకొని కూల్చివేతలను అడ్డుకొని ధర్నా చేశారు.
నల్లగొండ అభివృద్ధిలో భాగంగా గత బీఆర్ఎస్ సర్కార్ మర్రిగూడ బైపాస్ రోడ్డులో అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలతో పాటు గౌతమ బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేసి ఆ ప్రాంగణానికి బుద్ధవనంగా నాటి మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి నామకరణం చేశారు. నాడు ఏర్పాటు చేసిన శిలాఫలకం నల్లగొండ పట్టణంలోకి ప్రవేశించే వారికి కనిపించకూడదనే దురాలోచనతో కాంగ్రెస్ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో శిలా ఫలకాన్ని మంగళవారం తొలగించి ప్లాట్‌ఫామ్‌ను కూల్చేయత్నం చేస్తుండగా దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు.
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కనపడవద్దనే కుట్రతో..
హైదరాబాద్ నుంచి నల్లగొండ పట్టణంలోకి ప్రవేశించే మార్గంలో ఉన్న మర్రిగూడ బైపాస్‌లో మొదట అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలు ఉండేవి. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పీస్ నల్లగొండగా మార్చాలని గౌతమ బుద్ధుడి విగ్రహం, ‘వెల్కమ్ నల్లగొండ’ బోర్డుతో పాటు ఇతర బొమ్మలతో ఆ ప్రాంగణాన్ని అందంగా తీర్చి దిద్దారు. ప్రస్తుతం ఆ జంక్షన్ వచ్చి పోయే వారికి ఆహ్లాదాన్ని పంచుతోంది. కాగా రోడ్డు విస్తరణ పేరుతో మంత్రి కోమటిరెడ్డి ఆ ప్రాంగణాన్ని తొలగించాలనే ప్రయత్నం చేయగా దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు.
వారు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ విగ్రహాలను ఎలా తొలగిస్తారు.. ఇక్కడి కమిటీకి తెలియకుండా కూల్చడమేంటని ప్రశ్నిస్తూ వెంటనే కలెక్టర్, ఇతర అధికారులు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాల నేతలు పట్టు వీడకపోవటంతో ఉదయం తొలిగించిన ప్రభుత్వం మధ్యాహ్నం లోగా కూల్చివేసిన ప్లాట్‌ఫామ్‌ను పునరుద్ధరించి నాడు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని యధావిధిగా అమర్చారు. కార్యక్రమంలో దళిత సంఘం నేత, బీఆర్ఎస్ వార్డు ఇంచార్జి బొజ్జ వెంకన్న, పెరిక కరణ్ జయరాజ్, ఎమ్మార్పీఎస్ నేతలు బకరం శ్రీనివాస్, బొజ్జ దేవయ్య, కేవీపీఎస్ నేత పాలడుగు నాగార్జున, కత్తుల సహదేవ్, ఐతగోని జనార్దన్, బొజ్జ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

