TGSRTC | మా నిరసనలు అడ్డుకుంటే.. ఎక్కడిక్కడే బస్సులు ఆపేసి విధులు బహిష్కరిస్తాం: ఆర్టీసీ జేఏసీ
TGSRTC | తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రటేరియట్‌కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఆయా డిపోల నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు సిద్దమవుతుండటంతో పోలీసులు అడ్డుకోవద్దని కోరారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
TGSRTC | తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రటేరియట్‌కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఆయా డిపోల నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు సిద్దమవుతుండటంతో పోలీసులు అడ్డుకోవద్దని కోరారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల గురించి ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ఫిబ్రవరి 24వ తేదీ చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నామని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ఆర్టీసీ సంస్థ రక్షణ కోసం జరుగుతున్న పోరాటం, ఇది మా ఆత్మగౌరవ పోరాటం, ఇది మా ఆకలి పోరాటం, ఇది మా బతుకు పోరాటం, ఇది మా హక్కులకై పోరాటం, మా శ్రమ దోపిడీపై పోరాటం, మా శ్రమకు తగ్గ ఫలితానికై పోరాటం, మా కార్మిక సంఘాల కోసం పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పోరాటం శాంతియుతంగా, గాంధేయ మార్గంలో నిర్వహించబోతున్నామని చెప్పారు.
ఫిబ్రవరి 24న రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని ఈదురు వెంకన్న కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌కు రాకుండా పోలీసులు అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల గోసలు, గోడులు, ఆక్రందనలు చూసి ఈ ప్రభుత్వం దిగిరావాలనే కార్మికవర్గమంతా తరలివస్తున్నారని తెలిపారు. దీన్ని భగ్నం చేసే ప్రయత్నం అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే వదిలేసి, విధుల బహిష్కరణకు పిలుపునివ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

