Harish Rao | హైదరాబాద్ : ప్రభుత్వ పట్టింపులేని తనం, అధికారుల నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. పురుగుల అన్నం, కారం మెతుకులు తినలేక చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు.
తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు, నడిరోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నరు. గురుకులాల అధ్వాన్న పరిస్థితుల గురించి ప్రతిపక్షంగా మేము ఎన్ని సార్లు చెప్పినా మీకు చీమకుట్టినట్లైనా ఉండటం లేదు. ముఖ్యమంత్రి రావాలని, సమస్యలు పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నరు. నడిరోడ్డెక్కి నినదిస్తున్న వారి ఆవేదనను మానవత్వంతో అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి. విద్యాశాఖ మంత్రిగా కూడా మీరున్నారు. కాబట్టి గురుకులాల్లో నెలకొన్నసమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోండి. పరిపాలన మీద దృష్టి సారించి, ప్రజల సమస్యలను పట్టించుకోండి అని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు.
తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు, నడిరోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నరు.
ప్రభుత్వ పట్టింపులేని తనం, అధికారుల నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నది. పురుగుల అన్నం, కారం మెతుకులు తినలేక చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నరు.గురుకులాల అధ్వాన్న పరిస్థితుల… pic.twitter.com/LZEnD9nf0l
— Harish Rao Thanneeru (@BRSHarish) August 30, 2024
ఇవి కూడా చదవండి..
Zoo Park | హైదరాబాద్‌లో మరో జూ పార్క్.. వెయ్యి ఎకరాల్లో ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశాలు
Robert Vadra | నా భార్య ప్రియాంక గాంధీకి ఆల్ ది బెస్ట్ : రాబర్ట్ వాద్రా
Group-1 | గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయండి.. టీజీపీఎస్సీని ఆశ్రయించిన అభ్యర్థులు