Harish Rao | హైదరాబాద్ : తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రైతుల పాలిట శాపంగా మారింది. ఈ మూడింటిలో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అన్నదాతల నడ్డి విరుస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్.
రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ సంఘటితమై ఛలో ప్రజా భవన్‌కు పిలుపునిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకుపుట్టిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులను, రైతు సంఘాల నాయకులను ఎక్కడిక్కడ పోలీసు స్టేషన్లలో నిర్బంధిస్తూ వారిపై కక్ష తీర్చుకుంటున్నదని మండిపడ్డారు. రుణమాఫీ కోసం పోరుబాట పట్టిన రైతన్నలను అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య. బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టులు చేసిన రైతులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
మాది ఆంక్షలు లేని ప్రభుత్వం, కంచెలు లేని ప్రభుత్వం, ప్రజా పాలన అంటూ డబ్బా కొట్టుకునే రేవంత్ రెడ్డి ఇదేంది..? ప్రజా భవన్ చుట్టూ ఎందుకు ఇన్ని బారికేడ్లు..? ఎందుకు ఇన్ని ఆంక్షలు..? ప్రజాభవన్‌కు రైతులు తరలివస్తున్నారంటే సీఎంకు ఎందుకు అంత భయం..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా మొదలైన రైతుల ఉద్యమాన్ని ఎదుర్కోవడం అంటే.. రాజకీయంగా వెకిలి మకిలి, చిల్లర వ్యాఖ్యలు చేసినంత సులువు కాదని హరీశ్‌రావు పేర్కొన్నారు. రుణమాఫీ ఏమైందని నిలదీసేందుకు వస్తున్న రైతులకు ఏమని సమాధానం చెబుతావు..? రేవంత్ రెడ్డి.. రైతులందరికి 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి, మాట తప్పావు. ఇప్పుడది నీకు, నీ ప్రభుత్వానికి ఉరితాడు కాబోతున్నది. రుణమాఫీ చేసి తీరేదాకా, నిన్ను బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు, తెలంగాణ రైతాంగం వదిలిపెట్టదు. రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. చరిత్రలో ఏనాడూ బాగుపడలేదు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ సంఘటితమై ఛలో ప్రజా భవన్ కు పిలుపునిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకుపుట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా రైతులను, రైతు సంఘాల నాయకులను ఎక్కడిక్కడ పోలీసు స్టేషన్లలో నిర్బంధిస్తూ వారిపై కక్ష తీర్చుకుంటున్నది.
రుణమాఫీ కోసం పోరుబాట పట్టిన రైతన్నలను… pic.twitter.com/XWP17P2LKB— Harish Rao Thanneeru (@BRSHarish) September 19, 2024
ఇవి కూడా చదవండి..
KTR | 9 నెలల కాంగ్రెస్ పాలనలో కుప్పకూలిన వైద్య వ్యవస్థ.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
BRS Leaders | బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గూండాల దాడులు.. డీజీపీకి ఫిర్యాదు
Dasara Holidays | దసరా సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎప్పట్నుంచంటే..?