KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సరిపడా వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం.. ఉన్నచోట నిర్లక్ష్యం వహించడం కారణంగా రోగుల ప్రాణాలు బలవుతున్నాయి.
హుజుర్నగర్ ఏరియా హాస్పిటల్లో నవజాత శిశువు మరణానికి దారితీసిన ఘటన అమానవీయం, దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో వైద్య వ్యవస్థ కుప్పకూలిపోయింది అనడానికి ఇది అద్భుతమైన ఉదాహరణ అని చెప్పారు. బిడ్డను ప్రసవం చేసేందుకు గర్భిణి కడుపుపై నొక్కడం.. ఆ శిశువు మరణానికి దారి తీసిందన్నారు. వైద్య సిబ్బంది జవాబుదారీతనం ఎక్కడుంది..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆస్పత్రి వైద్య సిబ్బందికి నోటీసులు ఇవ్వడమే కాకుండా.. కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో శిశు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు 9 నెలల్లోనే అస్తవ్యస్తంగా మారాయి. ఇలాంటి భయానక చర్యలను ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
The unfortunate line of events leading to death of a new born at Huzurnagar Area Hopsital is inhumane and shocking!
One more glaring example of how Telangana’s healthcare system collapsed under CM Revanth Reddy’s Congress govt
Nurses stomping on a mother’s stomach to deliver a… pic.twitter.com/sCwZ4zRso1
— KTR (@KTRBRS) September 19, 2024
ఇవి కూడా చదవండి..
BRS Leaders | బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గూండాల దాడులు.. డీజీపీకి ఫిర్యాదు
TG Weather | తెలంగాణలో మూడురోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
Dasara Holidays | దసరా సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎప్పట్నుంచంటే..?