TG Weather | తెలంగాణలో గురువారం నుంచి ఈ నెల 24 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 21న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 22న కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబాబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
23న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. ఈ మేరకు మూడురోజులు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. మొన్నటి వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని భారత వాతావరణశాఖ పేర్కొంది. ప్రస్తుతం తిరోగమనం దిశ ప్రారంభమైందని.. ఈ సమయంలోనూ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలుంటాయని చెప్పింది.
Dasara Holidays | దసరా సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎప్పట్నుంచంటే..?
Nagababu | జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. మెగా బ్రదర్ నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్..!