Nagababu | జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. మెగా బ్రదర్ నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్..!
Nagababu | టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీపై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం జానీని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టులు పెట్టారు.
Nagababu | టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీపై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం జానీని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా సర్ విలియం గారో, రాబర్డ్ ఇవాన్స్ కోట్స్‌ను ట్వీట్ చేశారు. ‘చట్ట ప్రకారం నేరుం రుజువయ్యే వరకు ఏ వ్యక్తి నేరానికి పాల్పడినట్లు పరిగణించలేరు’ అనే సర్ విలియం గారో కోట్‌ను ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో.. ‘మీరు విన్నదే నమ్మవద్దు. ప్రతి కథకు మూడు కోణాలుంటాయి. మీది, ఎదుటివారిది. నిజానిది’ అనే రాబర్ట్ ఇవాన్స్ కోట్ని పోస్ట్ చేశారు. జానీకి మద్దతుగానే నాగబాబు ట్వీట్ చేశారనే చర్చ సాగుతున్నది. ప్రస్తుతం మెగా బ్రదర్ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నాగబాబు ట్వీట్స్‌పై పలువురు విమర్శలు గుప్పించారు. ఇక లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనసేన పార్టీ జానీని పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
No person can be considered guilty of a crime until he or she has been found guilty of that crime by a court of law.
:- Sir William Garrow— Naga Babu Konidela (@NagaBabuOffl) September 19, 2024
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీపై 376, 506, 323(2) కింద కేసులతో పాటు పోక్సో కేసు సైతం నమోదైంది. మరో వైపు పరారీలో ఉన్న జానీని సైబరాబాద్ పోలీసుల బృందం గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ కేసులో నార్సింగి పోలీసులు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయడంతో పాటు వైద్య పరీక్షలు సైతం నిర్వహించారు. బాధితురాలి ఇంట్లోనే పోలీసులు వివరాలు సేకరించారు. జానీ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని.. షూటింగ్ సమయంలో క్యారవాన్‌లో బలవంతం చేసినట్లు స్టేట్మెంట్లో పేర్కొంది. కోరిక తీర్చాలని వేధించాడని.. లేకపోతే సినిమా ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలు ఇప్పటికే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ని సైతం ఆశ్రయించింది. టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ అధ్యక్షురాలు ఝాన్సీ సైతం స్పందించారు. తమ పరిధిలో విచారణ జరిపామని.. ఇద్దరి వాదనలు విన్నామని తెలిపారు. 90 రోజుల్లో దీనిపై పూర్తి సమాచారాన్ని రిపోర్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఇదే తరహా సమస్యలు ఎవరైనా ఎదుర్కొంటే ఫిర్యాదు చేయాలని.. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
— Naga Babu Konidela (@NagaBabuOffl) September 19, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

