Harish Rao | మహబూబ్‌నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను ఎండగడుతున్నందుకే యూట్యూబ్ చానెళ్లపై సీఎం రేవంత్ రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి యూట్యూబ్ చానెళ్లను తక్కువ చేసి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. జడ్చర్లలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
య్యూట్యూబ్ ఛానెళ్లను తక్కువ చేసి మాట్లాడటం విడ్డూరం.. వారిని నమ్ముకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నవు. ఇప్పుడు మీ అక్రమాలను, మాట తప్పిన తీరును, మీ మోసాలను ఎండగడుతుంటే.. యూట్యూబ్ చానెళ్లను తక్కువ చేసి మాట్లాడం చాలా విడ్డూరంగా ఉంది. రేవంత్ రెడ్డి అవసరానికి తగ్గట్టు ప్రవర్తిస్తున్నారు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఓడ దాటెదాక ఓడ మల్లన్న ఓడ దాటినంక బోడి మల్లన్న అన్న చందంగా రేవంత్ తీరు ఉంది. ఈ యూట్యూబ్‌లను నమ్ముకునే గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేశావు కదా..? గత ప్రభుత్వం మీద అబద్దాలు చెప్పించి అధికారంలోకి వచ్చావు కదా..? అవే యూట్యూబ్ చానెళ్లు నీ భండారాన్ని, నీ అక్రమాలను, నీ అవినీతిని, నీ డొల్ల తనాన్ని, నువ్వు మాట తప్పిన తీరును, ప్రజలకు చేసిన మోసాలను బయటపెడతుంటే ఇవాళ నీవు తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ చానెళ్లను ఎండగడుతున్నావు. నీ గురించి ప్రజలకు అర్థమైపోయింది. బిడ్డా నిన్ను గద్దె దించడానికి ఈ రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్ళు ఒక్కటైతయి. నీ భండారాన్ని బయట పెడుతయి జాగ్రత్త అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ముఖ్యమంత్రికి వీళ్ల వెతలు కనిపించడం లేదా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్