RS Praveen Kumar | హైదరాబాద్ : బడుగు, బలహీన వర్గాలకు సుపరిపాలన అందించాల్సింది పోయి.. వారి జీవితాలపైకి బుల్డోజర్లను పంపుతున్న రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాయకష్టం చేసి, పస్తులుండి సంపాదించుకున్న ఆస్తిని నేలపాలు చేసిన రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్పీ నిప్పులు చెరిగారు.
నాడు వేదాలు వల్లించినందుకు మా నాలుకలను కోశారు.. శ్లోకాలను విన్నందుకు మా చెవుల్లో సీసం పోశారు.. తపస్సు చేసినందుకు మా శంభూకుడి తల నరికారు.. విశ్వాంతరాలను శోధించాలనుకొన్న మా రోహిత్ వేములను ఉరి వేశారు.. గుర్రాలనెక్కినందుకు, మీసాలు పెంచినందుకు రాళ్లతో కొట్టి చంపారు.. చదువుకుందామని గురుకులాలకొస్తే మా మట్టి దేహాలనుండి వాసనొస్తుందని ద్వేషిస్తారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
నేడు.. పొట్టచేతబట్టుకొని పట్నమొచ్చి పస్తులుండి, పిల్లలను చదివించుకుందమంటే మా గుడిసెలను కూలగొట్టి చివరికి మా బిడ్డల పుస్తకాలను కూడా ధ్వంసం చేస్తున్నరు అని ఆర్ఎప్పీ ఆవేదన వ్యక్తం చేశారు. నేటి ఇందిరమ్మ రాజ్యంలో.. జ్ఞానం నశించాలి.. అజ్ఞానం వర్ధిల్లాలి.. అమరులు ఒక కల.. తెలంగాణ ఒక వధ్యశిల.. ప్రజలు రోడ్లమీదనే బతకాలి.. హైడ్రా మాత్రం బాగా బతకాలి.. బంగళాల్లో సేదదీరుతున్న రేవంతన్న – భట్టన్నలు మాత్రం వర్ధిల్లాలి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. చివరగా ప్రతీకార పాలన జిందాబాద్ అంటూ తన ట్వీట్‌ను ఆర్ఎస్పీ ముగించారు.
నాడు
వేదాలు వల్లించినందుకు మా నాలుకలను కోశారు..శ్లోకాలను విన్నందుకు మా చెవుల్లో సీసం పోశారు..
తపస్సు చేసినందుకు మా శంభూకుడి తల నరికారు..
విశ్వాంతరాలను శోధించాలనుకొన్న మా రోహిత్ వేములను ఉరి వేశారు..
గుర్రాలనెక్కినందుకు, మీసాలు పెంచినందుకు రాళ్లతో కొట్టి చంపారు..… pic.twitter.com/DRcYzoSKll
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) September 10, 2024
ఇవి కూడా చదవండి..
Nallagonda | గురుకుల విద్యార్థులతో కూలీ పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులు : వీడియో
MGM Hospital | ఎంజీఎం హాస్పిటల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని గొలుసుతో కట్టేసి దాడి..వీడియో