నల్లగొండ : విద్యార్థులకు(Students) చదువు చెప్పి ఉన్నత భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థులతో కూలీ పనులు( Labor work )చేయించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా (Nallagonda)త్రిపురారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చదువుకునే విద్యార్థు లతో ఉపాధ్యాయులు కూలీ పనులు చేయించారు. ఇసుక, రాళ్లను ఎత్తిస్తూ స్టూడెంట్స్తో పని చేయించారు. విషయం తెలుసున్న బీఆర్ఎస్ నేత, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులతో పనులు చేపించకుడదని ఉపాధ్యాయులను హెచ్చరించారు. కాగా, పెన్నులు పట్టాల్సిన చేతులతో పలుగు, పార పట్టిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గురుకుల విద్యార్థులతో కూలీ పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులు
నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చదువుకునే విద్యార్థులతో కూలీ పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులు.
విద్యార్థులతో పనులు చేపించకుడదని ఉపాధ్యాయులను హెచ్చరించిన బీఆర్ఎస్ నేత నోముల భగత్. pic.twitter.com/NXLwynZ9FK
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2024