హైదరాబాద్ : వరంగల్(Warangal) ఎంజీఎం హాస్పిటల్లో(MGM Hospital) ఔట్ సోర్సింగ్ ఉద్యోగి (Outsourcing employee) సుమలతపై యూనియన్ లీడర్ రాజమ్మ దాడి(Assaulted )చేసి గాయపరిచిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఔట్ సోర్సింగ్ యూనియన్ లీడర్ రాజమ్మ ఎంజీఎంలో ఉద్యోగం ఇప్పిస్తే తనకు ప్రతినెలా డబ్బులు ఇవ్వాలని సుమలతకు కండీషన్ పెట్టింది. అయితే డబ్బులు ఇవ్వలేదని కోపంతో రాజమ్మ సుమలతను గొలుసుతో కట్టేసి దాడికి పాల్పడంతో గాయాలయ్యాయి. ఈ ఘటన పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సుమలతపై దాడి చేసిన యూనియన్ లీడర్ రాజమ్మ
సుమలతను గొలుసుతో కట్టేసి దాడి.. ఎంజీఎంలో ఉద్యోగం ఇప్పిస్తే తనకు ప్రతినెలా డబ్బులు ఇవ్వాలని కండిషన్ పెట్టిన రాజమ్మ.
డబ్బులు ఇవ్వలేదని కోపంతో సుమలతపై దాడి చేసిన రాజమ్మ.
ఈ ఘటన పై స్పందించిన… pic.twitter.com/Jeyj9jTzcn
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2024