సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 07:21:56

ఈసారి ఆన్‌‌లై‌న్‌‌లోనే ఇంజి‌నీ‌రింగ్‌ అడ్మి‌షన్లు!

ఈసారి ఆన్‌‌లై‌న్‌‌లోనే ఇంజి‌నీ‌రింగ్‌ అడ్మి‌షన్లు!

హైద‌రా‌బాద్: ఇంజి‌నీ‌రింగ్‌ కాలే‌జీల్లో అడ్మి‌షన్ల కౌన్సె‌లిం‌గ్‌ను అక్టో‌బ‌ర్‌‌లోనే పూర్తి‌చే‌యా‌లని రాష్ట్ర ఉన్నత విద్యా‌మం‌డలి అధి‌కా‌రులు భావి‌స్తు‌న్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌‌లైన్‌ లో చేప‌ట్టేలా చర్యలు తీసు‌కుం‌టు‌న్నారు. ర్యాంకులు పొందిన విద్యా‌ర్థుల సర్టి‌ఫి‌కెట్ల వెరి‌ఫి‌కే‌షన్‌ కూడా ఆన్‌‌లై‌న్‌‌లోనే నిర్వ‌హిం‌చా‌లని చూస్తు‌న్నారు. విద్యా‌ర్థులు తమ ఇంటి‌నుంచే అంటే టీఎ‌స్‌‌వె‌బ్‌‌సై‌ట్‌లో అప్‌‌లోడ్‌ చేసు‌కు‌నేలా సేవలు అందిం‌చ‌బో‌తు‌న్నారు. ఇందు‌కోసం ఇప్ప‌టికే సర్వీస్‌ ప్రొవై‌డర్‌ ఎన్‌‌ఐ‌సీతో సాంకే‌తిక విద్యా‌శాఖ అధి‌కా‌రులు సంప్ర‌దిం‌పులు జరు‌పు‌తు‌న్నట్టు తెలి‌సింది. దీనిపై త్వర‌లోనే ఎంసెట్‌ అడ్మి‌షన్ల కమిటీ తుది‌ని‌ర్ణయం తీసు‌కో‌ను‌న్నది.


logo