రాజన్న సిరిసిల్ల, మే 10 (నమస్తే తెలంగాణ) సిరిసిల్ల టౌన్/తెలంగాణ చౌక్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్‌లో నిర్వహించిన రోడ్‌షోకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కేసీఆర్‌ను చూసేందుకు బంగ్లాలు, హోర్డింగ్‌లపైకి ఎక్కారు. గులాబీ దళపతి ప్రసంగం ప్రారంభించగానే పటాకులు కాల్చి అభిమానం చాటుకున్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు సీఎం కేసీఆర్.. అంటూ నినదించారు.
ఇక్కడ నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, వేములవాడ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, నాయకుడు బొల్లి రామ్మోహన్, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలంతా కలిసి జనసమీకరణ చేశారు.
గంభీరావుపేట, మే 10: గంభీరావుపేట మండ లం నుంచి సుమారు 7వేల మంది కేసీఆర్ బాపు రోడ్‌షో కార్యక్రమానికి ఆయా వాహనాల్లో తరలివెళ్లడం అభినందనీయమని నాఫ్స్కాబ్ చైర్మన్ కొం డూరి రవీందర్రావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కొండూరి మాట్లాడారు. మండలంలోని 21 గ్రామాలకు 72బస్సులు, 250ఆటోలు, 600బైకులు, 15 డీసీఎమ్‌లు ఏర్పాటు చేయగా, 7వేల మంది సమావేశానికి తరలిరావడంతో వారిలో ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తున్నదన్నారు.
అనంతరం రోడ్‌షోకు వెళ్తున్న వాహనాల ర్యాలీని కొండూరి ప్రారంభించారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ విజయ, సెస్ డైరెక్టర్ నారాయణరావు, వైస్ ఎంపీపీ దోసల లత, నాయకులు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్‌రెడ్డి, గంద్యాడపు రాజు, దయాకర్‌రావు, గడ్డి హరీశ్, కమ్మరి రాజా రాం, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, తదితరులు ఉన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర శుక్రవారం జిల్లా కేంద్రంలోని నిర్వహించగా, మండలం నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. కేసీఆర్ బాపు సమావేశానికి సంప్రదాయ దుస్తులు ధరించి అన్నదాతలు తరలివెళ్లారు. పేద రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని స్పష్టం చేశారు. అనంతరం జై కేసీఆర్.. జై తెలంగాణ.. అంటూ వారు నినదించారు.
సిరిసిల్ల రూరల్, మే 10: తంగళ్లపల్లి మండలంలోని 30గ్రామాల నుంచి ప్రజలు, నాయకులు రోడ్‌షోకు అధిక సంఖ్యలో తరలివెళ్లారు.రోడ్‌షో సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఎంపీగా వినోద్‌కుమార్ భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ముస్తాబాద్, మే 10: జిల్లా కేంద్రంలో గులాబీ బాస్ రోడ్‌షోకు అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున వాహనాల్లో తరలివెళ్లారు. బోయినిపల్లి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరుతూ పలు గ్రామాల నుంచి నాయకులు అధిక సంఖ్యలో రోడ్‌షోకు హాజరయ్యారు.
వేములవాడ, మే 10: పట్టణం నుంచి కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్‌షోకు తరలివెళ్లారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతికుమార్, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, జోగిని శంక ర్, సిరిగిరి రామచందర్, గోలి మహేశ్, నాయకులు కుమ్మరి శ్రీనివాస్, నీలం శేఖర్, కొండ కనకయ్య, కొండ నర్సయ్య, వెంగళ శ్రీకాంత్ గౌడ్, అక్రమ్‌పాషా, వాసాల శ్రీనివాస్, అంజద్‌పాషా, సయ్యద్‌బాబా ఉన్నారు.
గంభీరావుపేట, మే 10: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్‌షోకు అధిక సంఖ్య లో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. గజసింగవరం గ్రా మానికి శుక్రవారం వచ్చిన కేటీఆర్ సభకు తరలివెళ్తున్న గ్రామస్తులతో మాట్లాడారు. ఇంటింటి నుంచి అందరూ ఉద్యమ స్ఫూర్తితో తరలివచ్చి కేసీఆర్ రోడ్‌షోను విజయవంతం చేయాలన్నారు. అలాగే కరీంనగర్ ఎంపీగా వినోదన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని కోరారు. ఉద్యమకారుడు, విద్యావంతుడు, న్యాయవాది అయిన వినోద్‌కుమార్‌ను పార్లమెంట్‌కు పంపించి.. ఈ ప్రాంతాన్ని అన్నింటా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఇక్కడ నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, తదితరులు ఉన్నారు.