ధన్వాడ/కొల్లాపూర్, నవంబర్ 25 : పింఛన్ కోసం వృద్ధులు(Elderly people) నిత్యం ఏదో ఒకచోట రోడ్డెక్కుతున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో సోమవారం పింఛన్ డబ్బులు (Pension) వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు హయాంలో నెలనెలా సక్రమంగా పింఛన్ ఇచ్చేవారన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
18 నుంచి 20వ తేదీలోగా పోస్టాఫీస్‌లో డబ్బులు ఇచ్చేవారని, ఈ నెల 25వ తేదీ వచ్చినా ఇంకా డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. పోలీసులు వృద్ధుల వద్దకు చేరుకొని రెండ్రోజుల్లో పింఛన్ ఇచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వృద్ధులు నిరసన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Shailaja | మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని శైలజ
KTR | ఫైవ్ స్టార్ హోటల్లో చీకట్లో కాళ్లు పట్టుకున్నుదెవరో.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం