Harish Rao | అదానీ 100 కోట్ల విరాళాన్ని తిరస్కరించిన సీఎం రేవంత్.. వాటి సంగతేంటని నిలదీసిన హరీశ్‌రావు
Harish Rao | యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇటీవల అదానీ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంతి హరీశ్‌రావు స్పందించారు. స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్లు నిధులు వెనక్కి తీసుకున్నారు సరే.. అదానీ అవినీతిపై రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్‌లో మీరు అదానీతో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటని ప్రశ్నించారు.
Harish Rao | యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇటీవల అదానీ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్లు నిధులు వెనక్కి తీసుకున్నారు సరే.. అదానీ అవినీతిపై రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్‌లో మీరు అదానీతో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటని ప్రశ్నించారు.
అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడుతామనే ప్రతిపాదనతో వస్తే, మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించేశామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించిందని తెలిపారు. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచిందని విమర్శించారు.
ఢిల్లీలో రాహుల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆదానీతో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడని హరీశ్‌రావు అన్నారు. ఇప్పుడు అదానీతో అవినీతి బయటికిరాగానే మాట మార్చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారూ…
మరి, రాహుల్ గాంధీ గారు అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్ లో మీరు ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల… pic.twitter.com/XuxVIF7IgM
— Harish Rao Thanneeru (@BRSHarish) November 25, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

